'ఉస్తాద్' లో ఈ మేటర్ నిజమైతే రిలీజ్ అయ్యాక రచ్చే
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'బ్రో' సినిమా పొలిటికల్ వివాదం వైపుగా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి అంబటి రాంబాబు డాన్స్ పై సెటైర్స్ వేయటంతో అంతటా రచ్చ,రచ్చ చర్చగా మారింది. అవి కలెక్షన్స్ కు ఎంతవరకూ కలిసొచ్చాయో కానీ, సినిమా గురించి మరింతగా జనాల్లోకి తీసుకెళ్లటంలో సాయిపడింది. మీడియాలో నిత్యం ఈ సినిమా గురించి మాట్లాడేలా వివాదం కలిసొచ్చింది. ఇక ఈ నేపధ్యంలో ఇప్పుడో కొత్త టాక్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పవన్ తదుపరి చిత్రంలో ఏపీ గవర్నమెంట్ పై సైటైర్స్ భీబత్సంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు. హరీష్ శంకర్ పూర్తి స్దాయి సెటైర్స్ తో స్క్రిప్టు రెడీ చేసారని చెప్పుకుంటున్నారు. బ్రో ని మించి ఐదారు రెట్లు సెటైర్ డైలాగులు వేయబోతున్నారని వినికిడి. బ్రో సినిమా సాంపిల్ అని ..అసలైన సినిమా ముందు ఉందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నిజంగా ఆ స్క్రిప్టులో అలాంటి మేటర్ ఉందో లేదో కానీ ఓ వర్గం మాత్రం ఎక్సపెక్ట్ చేస్తున్నారని అర్దమవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా చేస్తూ ముందుకువెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తన సినిమాలతో తన పొలిటికల్ మైలేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు.అందులో తప్పేమీ లేదు కూడా.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ తేరీ సినిమాను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే గబ్బర్ సింగ్‌ను మించేలానే ఉండబోతోన్నట్టుగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో కీ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో స్పెషల్ సెట్ వేయించారని తెలిసిందే. మరోవైపు ఓజీ షూటింగ్‌తో కూడా బిజీగాకానున్నాడు పవన్ కల్యాణ్.