Mahesh Babu: మహేష్-నమ్రత సో రొమాంటిక్... వైరల్ గా ఇంస్టాగ్రామ్ పోస్ట్


మహేష్ బాబు కుటుంబంతో పాటు వరల్డ్ టూర్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట స్విట్జర్లాండ్ లో ఉన్నారు. కాగా నమ్రత మహేష్ కూడిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది. 

mahesh wife namrata shares a romantic photo in instagram

సూపర్ స్టార్ మహేష్ స్టార్  కంటే కూడా ఫ్యామిలీ మెన్ గా ఉండటానికి ఇష్టపడతారు. టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ ప్రేమించినంతగా ఫ్యామిలీని మరొకరు ప్రేమించరేమో. ఏ కొద్ది సమయం దొరికినా పిల్లలతో భార్యతో గడిపేస్తారు మహేష్. ప్రస్తుతం మహేష్ భార్యా పిల్లలతో పాటు వరల్డ్ టూర్ లో ఉన్నారు. దీనిలో భాగంగా స్విజర్లాండ్ లోని అందమైన ప్రదేశాలను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో నమ్రత సోషల్ మీడియాలో ఓ రొమాంటిక్ ఫోటో షేర్ చేశారు. మహేష్ తనను కౌగిలించుకొని ముద్దాడుతున్న ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. 

సదరు ఫోటోకి.. నీకు సరిలేరు ఎవ్వరూ అంటూ కామెంట్ పెట్టింది. మహేష్ కంటే కూడా హౌస్ వైఫ్ గా నమ్రతనే పొగడాలి అచ్చ తెలుగు ఆడపిల్లలు, హీరోయిన్స్ కూడా పెళ్ళైతే ఏమి మా కెరీర్ మాదే అంటున్నారు. ముంబై కి చెందిన అల్ట్రా మోడ్రన్ మోడల్ మిస్ ఇండియా నమ్రత మాత్రం పెళ్ళైన వెంటనే మహేష్ మాత్రమే జీవితంగా గడుపుతున్నారు. తన కలలు, కెరీర్ పూర్తిగా పక్కన పెట్టి పూర్తి హౌస్ వైఫ్ గా మారిపోయారు. ఇద్దరు పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం వంటి బాధ్యతలు నమ్రత సమర్ధవంతంగా నిర్వర్తించారు. 

పిల్లలు పెద్దయ్యాక నమ్రత మహేష్ మేనేజర్ గా వ్యహరిస్తున్నారు. ఆయన బిజినెస్ లు , ఎండార్స్మెంట్స్ , డేట్స్ చూసుకుంటున్నారు. మరోవైపు మహేష్ త్వరలో త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. మహేష్ 28వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా... ఆగస్టు లో షూటింగ్ మొదలు కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios