SVP : వీకెండ్ దాటాక... కలెక్షన్స్ వీక్, బయ్యర్లుకు షాక్? బ్రేక్ ఈవెన్ ఎంత?!
ఉన్నంతలో ఆంధ్రా మెరుగే కానీ.. తెలంగాణలో మాత్రం సినిమా డ్రాప్ ఎక్కువగా ఉందనే చెప్పాలి. వీకెండ్లో కూడా నైజాం ఏరియాలో ఈ సినిమా పికప్ అయ్యితే ప్లస్ అవుతుంది.
మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మొన్న గురువారం రోజు (మే 12) మొదలైంది. ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేసిన ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ తేడాగానే అనిపించాయి. అయితే ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద చూపించలేదు. కొన్ని చోట్ల వీకెండ్ థియోటర్స్ పెంచారని వినిపించింది. ముఖ్యంగా మహిళలకు ఈ సినిమా బాగా నచ్చుతోందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంగా నెగిటివ్ టాక్ ని తట్టుకుని ఈ సినిమా ఈ వీకెండ్ లో ఏ మేరకు నిలబడిందో చూద్దాం.
వాస్తవానికి వీకెండ్ వరకు పరుగెలు పెట్టిన చాలా చిత్రాలు.. సోమవారం రాగానే చల్లబడిపోతాయి. అయితే సోమవారం కూడా డ్రాప్ లేకుండా నిలబడే హీరోల సినిమాలే సూపర్ హిట్స్ క్రింద అంటుంది ట్రేడ్. అది జరగనప్పుడు ఏ స్థాయిలో డ్రాప్ ఉంది అన్నదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట.. వీకెండ్ వరకు బాగానే నిలబడింది. శుక్రవారం వసూళ్ల డ్రాప్ చూసి బయ్యర్లలో ఆందోళన నెలకొంది.. అయితే ఊహించని విధంగా శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకోవడంతో రిలీఫ్ పీలయ్యారు.
ఇక సోమవారం సక్సెస్ మీట్ పెట్టి హడావిడి చేయడంతో ప్రమోషన్ల పరంగా సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు. కానీ ఆ రోజు నుంచి వసూళ్లు చాలా చోట్ల డ్రాప్ అయ్యాయని సమాచారం. ఆదివారంతో పోలిస్తే ఓవరాల్ వసూళ్లలో డ్రాప్ 70 శాతానికి పైగా ఉందంటున్నారు. ఇది షాక్ ఇచ్చే అంశమే. ఆ తర్వాతి రోజుల్లో కూడా పరిస్థితి పికప్ అవ్వలేదు.కలెక్షన్స్ ఇంకా ఇంకా పడిపోయాయి. బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట థియేటర్లు వెలవెలబోయినట్లు చెప్తున్నారు. బుక్ మై షో లోనూ స్పీడు లేదు. హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే... మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ మినహాయిస్తే ఎక్కడా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ లేకపోవటం గమనించవచ్చు.
ఉన్నంతలో ఆంధ్రా మెరుగే కానీ.. తెలంగాణలో మాత్రం సినిమా డ్రాప్ ఎక్కువగా ఉందనే చెప్పాలి. వీకెండ్లో కూడా నైజాం ఏరియాలో ఈ సినిమా పికప్ అయ్యితే ప్లస్ అవుతుంది. వచ్చే వీకెండ్లో సినిమా కలెక్షన్స్ బట్టే బయ్యర్లు ఏ మేరకు గట్టెక్కతారు అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఈ చిత్రం రూ.35-40 కోట్ల దూరంలో ఉందని చెప్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, పరశురాం తెరకెక్కించారు. ఈ మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది.