Mahesh babu :మహేష్ మాస్టర్ ప్లాన్... మిగతా హీరోలకు చెమటలే

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ని ప్యాన్ ఇండియన్ రేంజ్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ రిలీజ్ ఫిక్స్ అయింది. ప్యాన్ ఇండియా కోసం కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారట. స్క్రిప్టులో కూడా కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.

 

Mahesh babu Sarkaru Vaari Paata get a Pan India release?


ఇన్నాళ్లూ మహేష్ బాబు ప్యాన్ ఇండియా మార్కెట్ కు దూరంగా ఉంటూ వచ్చారు. హిందీ మార్కెట్ కూడా వద్దనుకున్నారు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా ప్రక్కన పెట్టేసారు.అయితే ఇప్పుడు తెలుగు సినిమా విస్తరణ, రిలీజ్ చూసాక తన ఆలోచనలు మార్చుకున్నారు. ప్యాన్ ఇండియా మార్కెట్ కు రెడీ అవుతున్నారు. ఈ విషయం ఖచ్చితంగా మిగతా హీరోలకు చెమటలు పట్టించేదే అంటున్నారు. ఎందుకంటే మహేష్ ఏది చేసినా  పక్కాగా చేస్తారు.  కథలు,డైరక్టర్స్ ఎంపిక లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఇప్పుడు హిందీ,తమిళ దర్శకుల కథలు కూడా వింటున్నట్లు సమాచారం. ఈ మేరకు కొందరి దర్శకులతో చర్చలు జరుపుతున్నారట. అంతేకాదు తన తాజా చిత్రం సర్కారు వారి పాట నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తున్నారట.
 
వివరాల్లోకి వెళితే...సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఈ మధ్యనే విడుదలైన 'కళావతి' పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ని ప్యాన్ ఇండియన్ రేంజ్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ రిలీజ్ ఫిక్స్ అయింది. ప్యాన్ ఇండియా కోసం కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారట. స్క్రిప్టులో కూడా కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.

 ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ మాత్రమే కాక మిగతా సౌతిండియన్ భాషల్లో కూడా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తారా అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమా ఈ ఏడాది మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. సముద్రఖని, వెన్నెల కిషోర్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

 ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రటీమ్, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 80  మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది. తక్కువ వ్యవధిలో తెలుగులో ఈ పాట ఈ రికార్డు క్రియేట్ చేసింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios