“లవ్ స్టోరీ” వెయిటింగ్ మోడ్, రిలీజ్ అప్పుడే
ఎక్కడ విన్నా సారంగ దరియా పాటే. జనాల్లోకి ఎంతగా ఆ పాట వెళ్లిపోయిందంటే రేపు థియోటర్స్ కు జనం కేవలం ఆ పాట కోసమే క్యూ కట్టేటంత. ఆ సినిమా మరేదో కాదు లవ్ స్టోరీ.
నాని లేటెస్ట్ చిత్రం టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ లు ఎప్పుడు రిలీజ్ అవుతాయా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే టక్ జగదీష్ ఇంక ఆగే ఓపిక లేక..అమేజాన్ ప్రైమ్ కు రిలీజ్ కు వెళ్లిపోయింది. ఏ పండగ సీజన్ లోనో సరైన టైమ్ చూసి ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేస్తారు. ఈ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ రైట్స్ కు రూ. 37 కోట్లు వచ్చాయి. ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ హక్కులను విక్రయించడం ద్వారా “టక్ జగదీష్” ఖాతాలో మరో రూ.14.5 కోట్లు పడినట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీ. మరి లవ్ స్టోరీ పరిస్దితి ఏమిటి...ఆ సినిమాని ఓటీటికు ఇస్తారా అంటే...
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’ . అలాగే ఇప్పుడు ఎక్కడ విన్నా సారంగ దరియా పాటే. జనాల్లోకి ఎంతగా ఆ పాట వెళ్లిపోయిందంటే రేపు థియోటర్స్ కు జనం కేవలం ఆ పాట కోసమే క్యూ కట్టేటంత. ఆ సినిమా మరేదో కాదు లవ్ స్టోరీ. అక్కినేని నాగ్‌చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.
ప్రేమలో కనిపించే బావోద్వేగాలను ప్రధానంగా ఈ సినిమాని డిజైన్ చేసారు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ , వైరల్ అయ్యిన పాటతో చెప్పాసారు శేఖర్ కమ్ముల. కథను పరిచయం చేయడం లో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. అందుకోసం ఫ్యాన్ వెయిటింగ్. అయితే ఈ సినిమా ఓటీటిలో రాదని తెలుస్తోంది.
రీసెంట్ గా నిర్మాత సునీల్ నారంగ్ ... మాట్లాడుతూ చిన్న నిర్మాతలు, చిన్నవాళ్లు ఓటీటీలకు తమ సినిమాలను అమ్ముకున్నారంటే పర్లేదు కానీ.. ఇలా పెద్ద వాళ్లు కూడా అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. తాను కూడా నిర్మాతనేనని, నిర్మాతకు ఉండే కష్టాలు తన కూడా తెలుసని అన్నారు. అయితే అందరి కంటే ఎక్కువగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు బాధలు పడుతున్నారని, దయచేసి సినిమాను కాపాడండి.. థియేటర్లను కాపాడండి అని నిర్మాతలను సునీల్ నారంగ్ రిక్వెస్ట్ చేశారు. తానేమీ బెదిరించడం లేదని, అందరికీ అర్థం కావాలనే ఇలా చెబుతున్నానని అన్నారు. ఇండస్ట్రీలోని నిర్మాతలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానని.. అక్టోబర్ 30 వరకు తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముకోవద్దని వేడుకున్నారు. ఆ తరువాత పరిస్థితులు బాగా లేకపోతే ఓటీటీలకు అమ్ముకోండని సూచించారు. ఇలా చెప్పిన సునీల్ నారంగ్ తన సినిమాని ఎలా అక్టోబర్ కు ముందే రిలీజ్ చేస్తారు. తన చెప్పిన మాటను తనే ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తారు. కాబట్టి లవ్ స్టోరీ ఎట్టి పరిస్దితుల్లోనూ అక్టోబర్ దాకా థియోటర్స్ కోసం వెయిట్ చేస్తుందనటంలో సందేహం లేదు.
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ లవ్‌స్టోరీలో నాగ్ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నుట్టు తెలిసింది. అటు సాయి పల్లవి సినిమాలో డ్యాన్సర్‌గా కన్పించనుందట. ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటోంది.
ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్ట్:రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : విజయ్ భాస్కర్,
పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల