Ram Charan: చరణ్.. శంకర్ సినిమా పై అదిరిపోయే అప్డేట్..
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక శంకర్ సినిమాలో స్ట్రాంగ్ విలన్ ఉంటూంటారు. దాంతో ఈ చిత్రంలో ఎవరు విలన్ గా చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తిచేశారు మేకర్స్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక శంకర్ సినిమాలో స్ట్రాంగ్ విలన్ ఉంటూంటారు. దాంతో ఈ చిత్రంలో ఎవరు విలన్ గా చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమీషనర్ గా నటించనుండగటంతో పాటు, ఓ మాస్ పాత్రతో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా స్టార్ యాక్టర్ అరవింద స్వామి నటించనున్నారట. గతంలో వీరిద్దరూ ధృవ సినిమాలో నటించగా ఆ సినిమాలో ఒకరికి ఒకరు పోటీపడి మరి నటించారు. ఇప్పుడు తాజాగా RC 15 లో విలన్ గా నటిస్తుండటం ఫ్యాన్స్‌కు పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ రానుందట.
ఈ వార్తతో శంకర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అంటున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రామ్ చరణ్ ఆ మధ్యన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు . "తెర మీద అయిన సినిమాలు చూసి ఇష్టపడతాం. ఇప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగా కంటే ఒక ఫ్యాన్ బాయ్ లాగా నేను సెట్లో ఉండేవాడిని. ప్రతి పాత్రలోనూ స్క్రిప్టు లోనూ ఆయన కనిపిస్తుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని రామ్ చరణ్. ఇదిలా ఉంటే.. మరోవైపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.