#Vijay Deverakonda: సమంత హెల్త్ ఇష్యూతో ‘ఖుషి’ లేటు అవుతుందా, టీమ్ ఏమంటోంది?

సమంత (Samantha), విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay devarakonda) కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ (Kushi). ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తున్న ఈ చిత్రానికి శివ‌నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Kushi is getting delayed due to the medical condition of Samantha


ఎంతో నమ్మకం పెట్టుకుని ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత రెండేళ్ళు గ్యాప్‌ తీసుకుని విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న  రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు,మార్నింగ్ షో  నుండి నెగెటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఓపెనింగ్స్‌ ఓకే అనిపించినా, సాయింత్రానికి డిజాస్టర్ టాక్ తో ...రెండో రోజు నుండి థియేటర్స్ ఖాళీ అయ్యిపోయాయి. ఈ సినిమా రిజల్ట్ విజయ్‌ను తీవ్రంగా నిరాశపరిచిందనేది నిజం. లైగర్ తో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న విజయ్‌ డ్రీమ్..ఓ కల గానే మిగిలిపోయింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే కసితో చేస్తున్నారు. నమ్మకంగా ఉన్నాడు. 

అయితే ఊహించని విధంగా సమంత...ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు  సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారని, గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సమంత స్పందించారు. తాను నటించిన యశోద సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్‌ ఉండటం గమనార్హం. గత కొన్ని నెలల నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నానని ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉందని సమంత తెలిపారు. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తానని త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారని ట్వీట్ చేశారు. అయితే సమంత..ఇప్పుడు షూటింగ్ లు హాజరు కావాలంటే ఆరోగ్యం పూర్తిగా సెట్ కావాలి. 

అసలే వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత...ఈ సినిమాకు కంటిన్యూ డేట్స్ కేటాయించలేకపోయింది. ఇప్పటికే కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభించాలి. నవంబర్ 20 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం అని టీమ్ చెప్తోంది. సమంత ఆరోగ్యం అప్పటికి పూర్తిగా సెట్ అయ్యి..షూటింగ్ కు హాజరు అవుతుందని టీమ్  భావిస్తున్నారు.  సమంత వెనుక తాము ఉంటామని అంటున్నారు.  ఈ లోగాసమంత టైటిల్‌ రోల్‌ చేస్తున్న యశోద పెండింగ్‌ పనులను పూర్తి అవుతాయి. యశోద చిత్రం నవంబర్‌ 11న విడుదల కానుంది.

ఖుషీ చిత్రంలో ప్రముఖ క‌న్న‌డ నటుడు జ‌య‌రాం, స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. విజయ్ దేవ‌ర‌కొండ‌-సమంత కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక  విజయ్ దేవరకొండ...రీసెంట్ గా ఓ యంగ్‌ డైరక్టర్ కి చాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరితో విజయ్‌ తన తదుపరి సినిమా చేయనున్నట్లు టాక్‌. ఇటీవలే గౌతమ్‌, విజయ్‌ను కలిసి ఓ స్టోరీ ఐడియాని చెప్పారని, అది బాగా నచ్చడంతో విజయ్‌...ఫుల్ స్క్రిప్టు తో వింటానని చెప్పారట. అన్నీ కుదరితే అది ప్యాన్ ఇండియా సినిమా అయ్యే అవకాసం ఉందిట. ప్రస్తుతానికి అయితే ఆ ప్రాజెక్టుని పూర్తిస్దాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు.  

 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios