Kriti Shetty: పాపకు పెద్ద షాకే, పూర్తిగా డీలా పడిందిట!

‘ఉప్పెన’లో బేబమ్మ గా,  శ్యామ్‌సింగరాయ్‌లో కీర్తి గా, ‘బంగార్రాజు’లో నాగలక్ష్మీ గా  విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారారు కృతీశెట్టి. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘వారియర్‌’. ఆమె పాత్ర పేరు మహాలక్ష్మీ. ఆర్జేగా పనిచేస్తుంది.. లవబుల్‌, క్యూట్‌, గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌లాగా ఉంటుంది. మా ఇంటి అమ్మాయి అని ప్రేక్షకులు ఫీలయ్యేలా ఆమె పాత్ర ఉంటుంది. 
 

Kriti Shetty Upset With The Warrior Disaster!

కృతి శెట్టి..అతి తక్కువ సమయంలోనే కుర్రాళ్ల హార్ట్ బీట్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో హాట్ బ్యూటీగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ‘ది వారియర్’ మూవీతో ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని ఆశించింది. 

‘మార్నింగ్‌ వార్నింగ్‌ ఇచ్చి.. ఈవెనింగ్‌ అరెస్ట్‌ చేసిన పర్ఫెక్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ని చూశారా ఎప్పుడైనా’’ అంటూ ఆర్జే మహాలక్ష్మీ గా రీసెంట్ గా రిలీజైన వారియర్ చిత్రంలో  అలరించిందీ  బ్యూటీ. లింగుస్వామి (Lingu swamy)దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ పోతినేని హీరో. తెలుగు. తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై  కృతీశెట్టి  చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా తన కెరీర్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకువెళ్తుందని నమ్మింది ఆమె. అయితే  సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ హిట్ మిషన్ ఒక్కసారిగా డీలా పడింది. 

ఆమెకు ఇది ఊహించని దెబ్బే అంటున్నారు. పెద్ద హీరో, కమర్షియల్ గా రెండు పాటలు మంచి హిట్ , తమిళ రిలీజ్ ఇవన్నీ ఆమెను ఈ సినిమాపై ఆసక్తి పెంచేలా చేసాయి. కానీ కలెక్షన్స్ చాలా దారుణంగా ఉండటం ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మినిమం ఓపినింగ్స్ కూడా ఈ సినిమా రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడామె దృష్టి మొత్తం  మాచర్ల నియో.క వర్గం’ సినిమాపై ఉంది.  సూర్య–బాల కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్య, వెంకట్‌ ప్రభు నటిస్తున్న ఓ సినిమాకూ సైన్‌ చేసింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios