Asianet News TeluguAsianet News Telugu

“పుష్ప” కన్నా వారం ముందే ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’?

 పుష్ప, కేజీఎఫ్ 2 సినిమాలు రెండూ క్రిస్మ‌స్ సీజన్ లో రిలీజ్ కాబోతుండ‌టంతో ఏ మూవీ ఎలా ఉంటుంది, క్రిస్మ‌స్ విజేత ఎవ‌రు అనే దానిపై అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి.  రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.  

KGF2 is okay with Pushpas competition!
Author
Hyderabad, First Published Aug 7, 2021, 12:25 PM IST

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా  విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్  ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం డిసెంబర్ 25న విడుదల కానుంది. అదే  సమయానికి మరో భారీ చిత్రం కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు భారీ అంచనాలతో రూపొందిన “కేజీఎఫ్-2”. ఈ  చిత్రం “పుష్ప”రాజ్ కు పోటీగా రానుంది అని తెలుస్తోంది.

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ “కేజీఎఫ్”కు సీక్వెల్ గా ఈ “కేజీఎఫ్-2″ను రూపొందించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా రిలీజ్ కు బ్రేకులు వేసింది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల రీఓపెన్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఇక పెద్ద సినిమాలన్నీ విడుదలకు వరుస కడుతుండడంతో ఇప్పుడు డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో “పుష్ప”రాజ్ ను యష్ “కేజీఎఫ్-2” ద్వారా ఢీ కొట్టబోతున్నాడు అంటున్నారు.

ఈ నేపధ్యంలో కేజిఎఫ్2 రిలీజ్ పై మరింత ఇంట్రస్ట్ నెలకొంది.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. డిసెంబర్ లో పుష్ప కన్నా 5 రోజుల ముందు… డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం.  ఏదైమైనా “కేజీఎఫ్-2” నుంచి అధికారిక ప్రకటన వస్తేగానీ ఈ వార్తలపై ఓ క్లారిటీ రాదు.

‘కేజీఎఫ్‌’ మూవీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేనవసరం. ఎలాంటి అంచనాలు లేకుండా 2018 విడుదలైన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీకి సిక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios