హాట్ టాపిక్: 'పుష్ప' లో కట్టప్ప టైప్ ట్విస్ట్
సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా సినిమాపై క్యూరియాసిటీ నిలబడేలా ..ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే టైప్ ట్విస్ట్ ని వదులుతారు. జనం దాన్ని డిస్కస్ చేసుకుంటూ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తారు అని ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఘన విజయం సాధించిన బాహుబలి పార్ట్ వన్ ఎండింగ్ లో వచ్చే "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్నతో కూడిన ట్విస్ట్ ఎంత హైలెట్ అయ్యిందో తెలిసిందే. ఆ విషయం మీదే బ్యాంకింగ్ చేసి సెకండ్ పార్ట్ ని రూపొందించారు. ఆ ట్విస్ట్ తో కూడిన క్వచ్చిన్ తోనే ఓ రేంజిలో హైప్ ఈ సినిమాకు ఏర్పడింది. ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే 'పుష్ప' కు ప్లే చేయబోతున్నట్లు సమాచారం.
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం రెండు పార్ట్ లకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం,సుకుమార్ కు జ్వరం రావటం వలన కొన్నిరోజుల క్రితం ఆగిపోయిన షూటింగు, రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పూర్తవగానే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నారు అల్లు అర్జున్. ఐకాన్ రిలీజ్ తర్వాత పుష్ప సెకండ్ పార్ట్ కు వెళ్తారు. ఈ గ్యాప్ లో సుకుమార్ సెకండ్ పార్ట్ కు సంభందించిన స్క్రిప్టు వర్క్ చేసుకుంటారు. ఇక సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా సినిమాపై క్యూరియాసిటీ నిలబడేలా ..ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే టైప్ ట్విస్ట్ ని వదులుతారు. జనం దాన్ని డిస్కస్ చేసుకుంటూ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తారు అని ప్లాన్ చేసినట్లు సమాచారం.
అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా దసరా బరిలో నిలిచేది. కానీ కరోనా వలన షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అందువలన ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పడంతో, ఒక రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి.
మరో ప్రక్క ‘పుష్ప’ ప్రచారం ప్రారంభం కానుంది. ఈ చిత్రం తొలి పాటని ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ప్రకటించారు హీరో అల్లు అర్జున్. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి పాటని విడుదల చేయనున్నారు. ‘దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక...’ అంటూ సాగే తెలుగు గీతాన్ని శివమ్ ఆలపించారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ - దేవిశ్రీప్రసాద్ కలయికలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య2’ పాటలు పెద్ద హిట్ అయ్యాయి. పదేళ్ల తర్వాత ఈ కలయికలో వస్తున్న సినిమానే ‘పుష్ప’. శేషాచలం అడవుల్లో... ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. ప్రధాన విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా… ఈ యాక్షన్ డ్రామాను ముత్తాశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.