Asianet News TeluguAsianet News Telugu

#Rajamouli: రాజమౌళి,మహేష్ మూవీలో తమిళ స్టార్ హీరో?

ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈమూవీ జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని కొంతమంది అంటుంటే మరికొంత మంది మాత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. 

Karthi roped in for Rajamouli,Mahesh movie?
Author
First Published Nov 17, 2022, 7:41 AM IST


ఎప్పుడూ కొన్ని కాంబినేషన్లు  చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. వాటిని చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో మహేశ్‌బాబు - రాజమౌళి ప్రాజెక్టు ఒకటి. ఈ కాంబోలో ఎప్పుడో సినిమా మొదలు కావాల్సి ఉన్నా... రాజమౌళి 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్‌ క్లియర్‌ అయినట్లే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రాజమౌళి మొదలుపెట్టారు. మరోవైపు మహేశ్‌బాబు కూడా త్రివిక్రమ్‌ సినిమాను పట్టాలెక్కించారు. ఆ సినిమా పూర్తవ్వగానే... రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేష్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన కొన్ని అప్డేట్ వైరల్ గా మారుతున్నాయి.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి-మహేశ్ సినిమాలో విలన్​గా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటింనున్నారని ప్రచారం సాగుతోంది. రీసెంట్ గా  కార్తిని సంప్రదించారని ఆయన పాత్ర గురించి చెప్పారని తెలిసింది. పాత్ర నచ్చడంలో కార్తి కూడా ఒకే చెప్పడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరోలనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ విషయం బయటకు రావడం వల్ల రాజమౌళి, మహేశ్​ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్​ అవుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే.  ఈ సినిమా వరల్డ్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాల కంటే భారీ బడ్జెట్‌తో ఒక ఎపిక్ అడ్వంచర్ ఫిలింగా రాజమౌళి చేయబోతున్నారని సమాచారం.

ఇప్పటికే రాజమౌళి మహేశ్​ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారు. కె.ఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.

మరోవైపు, ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్: 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో కార్తి.. మొన్న దీపావళి కానుకగా ‘సర్దార్’గా వచ్చారు. ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. తెలుగులోనూ కమర్షియల్ గానూ వర్కవుట్ అయ్యింది. జపాన్ సినిమాతో వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న'జపాన్' మూవీ నుండి.. నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ బట్టి చూస్తే ఇది మాఫియా అండ్ కామెడీ కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కార్తీ జపాన్ అనే ఒక చలాకి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కార్తీ ఈ పాత్రను పరిచయం చేస్తూ.. "జపాన్ మేడ్ ఇన్ ఇండియా. ఈ టిపికల్ రోల్ చేయడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న" అంటూ ట్వీట్ చేశాడు.

 కార్తీ 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. సునీల్ కి ఇది మొదటి తమిళ స్ట్రెయిట్ ఫిల్మ్ కావడం విశేషం. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 
  

Follow Us:
Download App:
  • android
  • ios