ఫిల్మ్ స్టూడియోలో ఎన్టీఆర్‌ పెట్టుబడులు.. అసలు విషయం ఏంటంటే?

ఇప్పటికే చాలా మంది తెలుగు హీరోలు సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటే .. మరికొందరు థియేటర్స్, రెస్టారెంట్లు వంటి బిజినెస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. రకుల్ వంటి హీరోయిన్స్ జిమ్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టారు. 

The Truth behind Jr. NTR invests in a film studio

RRR సినిమా ఘన విజయంతో ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్ గా ఎదిగారు. అలాగే దేశంలోనే అతిపెద్ద స్టార్లలో ఎన్టీఆర్ ఒకరు అయ్యారు.  ఈ క్రమంలో ఎన్టీఆర్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అతను ఏమి చేస్తున్నాడో తెలుసుకోవడానికి అందరూ ఇంట్రస్టింగ్ గా  ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. అదే సమయంలో ఇప్పుడో కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 
 
ఇంతకాలం ఎన్టీఆర్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిజినెస్ వ్యవహారాలపై కూడా దృష్టి పెడుతున్నట్టుగా ఆ వార్తల సారాంశం. స్టార్ హీరోలంతా ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున ఇతర బిజినెస్ లతో బిజీగా ఉన్న నేపధ్యంలో ఎన్టీఆర్ సైతం రంగంలోకి దూకుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ తన స్నేహితులతో కలిసి ఓ స్టూడియో నిర్మాణంలో పెట్టుబడులు పెడుతున్నట్లు, శంషాబాద్ సమీపంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ పనులు మొదలు పెడుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే అందులో కొంతవరకే నిజం ఉందని తెలుస్తోంది.

నిజానికి చాలా కాలం క్రితమే ఈ స్టూడియో ప్రారంభం అయ్యింది. ప్రభాస్ సినిమా షూటింగ్ సైతం జరిగింది. అలాగే మరికొన్ని పెద్ద సినిమా షూటింగ్ లు జరిగాయి. ఇప్పుడు `ఎన్టీఆర్‌30` కూడా అక్కడే షూటింగ్‌ జరుగుతుందట. ఇక ఎన్టీఆర్ ఇందులో పెట్టుబడుతున్నారనే వార్త విషయానికి వస్తే..ఈ స్టూడియోకు ఎన్టీఆర్ సంభందం లేదని వినికిడి. ఈ  స్టూడియోలో పార్టనర్స్ నలుగురు.. వాళ్లు పీపుల్స్ మీడియో ఫ్యాక్టరీ బ్యానర్ లో  కీలక పొజీషన్ లో ఉన్న వివేక్ కూచిభట్ల, కాశ్మీరీ ఫైల్స్ అభిషేక్ అగర్వాల్, ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి , తాహిర్ అని మరొకరు ఈ ప్రాజెక్టులో ఉన్నారని.. డైరక్ట్ గా ఎన్టీఆర్ కు ఏ విధమైన సంబంధం లేదని తెలుస్తోంది.  ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి కూడా ఇన్వాల్వ్ కావటంతో ఎన్టీఆర్ పేరు బయిటకు వచ్చిందని చెప్తున్నారు.

అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జూ.ఎన్టీఆర్ పెట్టుబడులు ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దాంతో ఈ ఫిల్మ్ స్టూడియో విషయంలో ఎన్టీఆర్ ఇన్వాల్వమెంట్ ఉన్నట్లే అంటున్నారు.  నిర్మాణం కాబోతున్న స్టూడియోలో సెట్స్ వేసుకుని షూటింగ్స్ చేసుకోవచ్చు. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్రేన్లు .. కెమెరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగులకు వాటిని రెంట్ కి ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తలో  వాస్తవమెంతన్నది తెలియాల్సి ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios