#Maheshbabu:మహేశ్ .. త్రివిక్రమ్ ప్రాజెక్టుపై షాకింగ్ రూమర్! అసలు నిజం ఏమిటి

 త్రివిక్రమ్, మహేష్  కాంబినేషన్ అనుకున్న తరువాత చాలా ఆలస్యంగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఓ పది రోజుల పాటు షూటింగు జరిపారు. ఆ తరువాత షెడ్యూల్ కి సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించకపోవటమే ఈ రూమర్స్,అనవసర వార్తలకు కారణమవుతోంది. 

Is Trivikram-Mahesh Movie in Trouble?

 సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వచ్చిన ‘అతడు’ చిత్రం ఎంత పెద్దో తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన  ‘ఖలేజా’ చిత్రం కమర్షియల్ గా ఆ స్థాయిలో హిట్ అవకపోయినా..ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా మొదలైంది. అయితే మొదలైన నాటి నుంచి ఏదో ఒక నెగిటివ్ వార్త ఈ సినిమా గురించి హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ రూమర్ మొదలైంది.  

వాస్తవానికి త్రివిక్రమ్, మహేష్  కాంబినేషన్ అనుకున్న తరువాత చాలా ఆలస్యంగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఓ పది రోజుల పాటు షూటింగు జరిపారు. ఆ తరువాత షెడ్యూల్ కి సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించకపోవటమే ఈ రూమర్స్,అనవసర వార్తలకు కారణమవుతోంది. మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను బట్టి ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగు లేనట్టే అనేది బయట వినిపిస్తున్న మాట. కథ విషయంలో మహేశ్ బాబుకి రావలసిన క్లారిటీ రాకపోవడం వలన .. పాన్ ఇండియా స్థాయి కంటెంట్ లేకపోవడం వలన మహేశ్ ఇప్పటికి ఆపేద్దాం అని చెప్పినట్టుగా ఒక రూమర్ వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ వంటి రచయిత, దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతనే సెట్స్ కు వెళ్తారు. ముందే మహేష్ మొత్తం విని ఓకే చెప్పి ఉంటారు. అలాంటప్పుడు ఇలా మధ్యలో స్క్రిప్ట బాగోలేదని చెప్పే అవకాసం ఎక్కడుంటుంది.  

అయితే అందుకు కారణంగా ..త్రివిక్రమ్ ఒక వైపున సొంత బ్యానర్లో వచ్చే సినిమాల పైన దృష్టి పెట్టడం .. మరో వైపున కొన్ని సినిమాలకి కథలను ఇస్తుండటం చెప్తున్నారు. అనుకున్న సమయానికి మహేశ్ మూవీకి సంబంధించిన బౌండ్ స్క్రిప్ రెడీ కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ షూటింగ్ ఏమీ ఆపేయటం లేదు. కేవలం మహేష్ బాబు తల్లి చనిపోవటంతో గ్యాప్ తీసుకున్నారు. తన కుటుంబంతో పర్శనల్ టైమ్ గడపటానికి లండన్ వెళ్లారు.  ఆ మూడ్ నుంచి బయిటకు రాగానే మహేష్ షూట్ లో పాల్గొంటారు.

ఈ సినిమా పూర్తిగా త్రివిక్రమ్ మార్క్‌తో ఉండే యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ అని సమాచారం. ఇందులో మహేష్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా కనిపిస్తాడరట. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. తర్వాత తొందర్లోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టాలని చూస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios