prabhas: 'జాతి రత్నాలు' కి 'రాధేశ్యామ్' కు రిలేషన్ ఇదీ, రిజల్ట్ కి ?
'జాతి రత్నాలు' నవ్వులు పూయించి భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దాదాపుగా 30 కోట్ల వరకు షేర్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పాండమిక్ టైములో ఓవర్ సీస్ లో తెలుగు సినిమాలకు ఊపిరి పోసింది.
ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' గా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. టి - సిరీస్ .. యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. ప్రేమకి .. విధికి జరిగే పోరాటాన్ని చూడమని ఈ పోస్టర్ ద్వారా చెబుతూ ఆసక్తిని రేకెత్తించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ కు, రిలీజ్ కు ముడెట్టుతున్నారు. ఎలాగంటారా..
గతేడాది 'జాతి రత్నాలు' సినిమా విడుదలైన రోజునే 'రాధేశ్యామ్' చిత్రం రిలీజ్ అవుతుండమే ఇక్కడ లింక్. మహా శివరాత్రి కానుకగా 2021 మార్చి 11న థియేటర్లలోకి వచ్చిన 'జాతి రత్నాలు' నవ్వులు పూయించి భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దాదాపుగా 30 కోట్ల వరకు షేర్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పాండమిక్ టైములో ఓవర్ సీస్ లో తెలుగు సినిమాలకు ఊపిరి పోసింది. ఇప్పుడు అదే తేదీకి ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది.
అలాగే జాతిరత్నాలు ప్రమోషన్ కు ప్రభాస్ వెళ్లాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కు సైతం జాతిరత్నాలు హీరో వచ్చాడు. అలా కూడా రెండింటికి సింక్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఒకటయ్యింది. దాంతో ఈ సినిమా కూడా అలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్నే అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే మార్చి మొదటి మూడు వారాలు పరీక్షలతో చాలా వరకు కుర్రాళ్లు మొత్తం బిజీగా ఉంటారు. దాంతో మెజారిటీ యూత్ థియోటర్ దగ్గర కనపడకపోవచ్చు. సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. ఆ ఇంపాక్ట్ కొంత ఉండవచ్చు.
ఇంతేకాకుండా మార్చి 4న డీసీ కామిక్ సూపర్ హీరో మూవీ ‘బ్యాట్ మ్యాన్’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఇండియాలో ఎఫెక్ట్ చూపకపోయినా.. విదేశాల్లో బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేసి ప్రభాస్ సినిమా ఎలాంటి విజయాన్ని చూడాలి.
భవిష్యత్తులో ఏం జరగనుందో తెలిసి కూడా దానిని మార్చడానికి హీరో చేసే పోరాటమే ఈ కథ. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ కనిపించనుండగా, ముఖ్యమైన పాత్రల్లో కృష్ణంరాజు .. జగపతిబాబు .. సత్యరాజ్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఏ స్థాయి రికార్డులకు తెర తీస్తుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మరియు అన్ని పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.. సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి.