RRR:ఎన్టీఆర్, రామ్ చరణ్ బాగా డిప్రెస్ అయ్యారా ? సాక్ష్యం ఇదే??

 
రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో  రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”.డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయటానికి ప్లాన్ చేసారు.  

Is NTR And Ram Charan Depressed?

ఈ వారంలో రిలీజ్ అవుతుంది...పెద్ద హిట్ అవుతుంది. ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి అంటూ రోజులు,గంటలు లెక్కబెట్టుకుంటున్న సమయంలో అనుకోనిదే జరిగింది. సినిమా వాయిదా పడింది. ఫ్యాన్స్ డీలా పడ్డారు. సోషల్ మీడియాలో తమ నిరసన తెలియచేసారు. అయితే ఫ్యాన్స్ కే అలా ఉంటే ఆ హీరోల పరిస్దితి ఎలా ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బాగా డిప్రెస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అందులో వింతకూడా ఏమీ లేదు. మానవ సహజమైన స్పందన ఇది. 

మీడియావర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా గత మూడు రోజులుగా ఎవరినీ కలవటం లేదట. సినిమా ఫోస్ట్ ఫోన్ అయ్యాక...ఏ ట్వీట్ చెయ్యలేదు ఇద్దరూ. ఎన్టీఆర్ జనవరి 1 లేటుగా న్యూ ఇయిర్ విషెష్ చెప్పి ఊరుకున్నారు. రామ్ చరణ్ అయితే అదీ చెయ్యలేదు. ఆచార్య చిత్రం ప్రోమో సింగిల్ ని కూడా షేర్ చెయ్యలేదు. రాజమౌళి కూడా సైలెంట్ అయ్యిపోయారు. అయితే మళ్లీ ఏదో రోజు ఎనౌన్సమెంట్ వస్తుంది రిలీజ్ డేట్ తో అప్పుడు అందరూ తిరిగి ఆనందోత్సాహాలుతో ముందుకు పరుగులు తీస్తారు. ఆ రోజు కోసం వెయిటింగ్ చేద్దాం.
  
రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో  రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”.డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయటానికి ప్లాన్ చేసారు.   మా చిత్రాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. బేషరతుగా ప్రేమిస్తున్న అభిమానులు, ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అని చిత్ర యూనిట్ తెలిపింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని మళ్లీ మీ ముందుకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నామ‌ని నిర్మాణ సంస్థ డివివి ఎంట‌ర్ టైన్ మెంట్ తెలిపింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ఓ ట్వీట్ ని పోస్ట్ చేశారు.

Also Read : RRR Loss: `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా.. ప్రమోషన్స్ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా? 

వాస్తవానికి నార్త్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి రావడంతోనే దర్శకుడు రాజమౌళి మనసు మార్చుకోక తప్పలేదని సమాచారం. ముంబ‌యిలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో స‌మావేశమై వాయిదా నిర్ణ‌యం తీసుకున్నాడు రాజమౌళి. ఇప్పటికే నాలుగు సార్లు ఈ సినిమా వాయిదా పడింది. అసలు జనవరి 7కి రిలీజ్ అంటే దీనిపై పెద్ద రచ్చ జరిగింది. రాజమౌళి పై చాలా విమర్శలు వచ్చాయి.  పరిస్దితులు చక్కబడితే సమ్మర్ కే  సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది.  

  ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

Also Read : Rajamouli:హిందీ ‘ఛత్రపతి’లో ఆ సీన్స్ తొలిగించారు,రాజమౌళి ఫీలవుతారా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios