'మైత్రీ మూవీ మేకర్స్' వల్లే నష్టపోతున్నామని గోలెత్తుతున్న నిర్మాతలు

వరుసగా సినిమాలు చేస్తూ, కనీసం నెలకో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలి అనుకుంటుంది ఈ సంస్థ. పెద్ద, చిన్న అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో అందరికి సపోర్ట్ చేస్తూ భారీ నిర్మాణ సంస్థగా ఎదగడానికి ముందుకు దూసుకెళ్తుంది.

Is Mythri Movie Makers facing the heat from other producers

ఇండస్ట్రీలో ఎన్నో ప్రొడక్షన్ హౌజ్ లున్నా పెద్ద బ్యానర్లు మాత్రం తక్కువగానే ఉంటాయి. గత కొన్ని కాలంగా అగ్ర నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్నా ఆయన కొత్త బ్యానర్ కన్నా వెనుక పడ్డారు. ఆయన సినిమాలను  కూడా దాటేసింది ఓ బ్యానర్. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న గీతాఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్.. ఇలాంటి పెద్ద బ్యానర్స్ ని దాటుకొని వరుస సినిమాలు, వరుస హిట్స్ తో ముందుకెళ్తుంది ఓ సంస్థ. ఆ బ్యానరే మైత్రి మూవీ మేకర్స్.

శ్రీమంతుడు సినిమాతో స్టార్ట్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం మూడు హిట్లు, ఆరు సక్సెస్ లు అన్నట్లు దూసుకుపోతోంది. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో మరో భారీ సక్సెస్  అందుకుంది.  ప్రస్తుతం దాదాపు 10 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది మైత్రి నిర్మాణ సంస్థ. మైత్రి చేతిలో దాదాపు వెయ్యి కోట్లకు పైగానే బడ్జెట్ లాక్ అయ్యి ఉంది. స్టార్ హీరోలతో పాటు అప్ కమింగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ కంటెంట్ ప్రజెంట్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్. అయితే ఇప్పుడు అదే బ్యానర్ సమస్యలో పడింది. డిస్ట్రిబ్యూటర్స్ ని ఒత్తిడి ఎదుర్కొంటోందని సమాచారం.

చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో వీర సింహా రెడ్డి వంటి మాస్ ఎంటర్టైనర్స్ చేస్తున్న ఈ బ్యానర్స్ థియేటర్స్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటోందని వినికిడి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి 2023కు రిలీజు అవుతుననాయి. నిర్మాతలు ఈ రెండు సినిమాల రిలీజ్ లు ఉంచాలని ప్రయత్నం చేసారని కానీ సాధ్యం కాలేదని తెలిసింది. ఇద్దరు సీనియర్ హీరోలు తగ్గేదేలే అన్నట్లుగా సంక్రాంతికే పోటీపడుతున్నారు. దాంతో ఈ సంస్ద ...డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ కాల్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  ఆదిపురుష్, వారసుడు కూడా సంక్రాంతికే వస్తున్న నేపధ్యంలో బి,సి సెంటర్లలో స్క్రీన్స్ దొరకటం చాలా కష్టంగా ఉంది. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ వారు రెండు సినిమాల్లో ఒకటి వాయిదా వేసుకుంటే సమస్య తీరుతుందని అంటున్నారట. 

ఒకే బ్యానర్ వాళ్లు రెండు సినిమాలతో సంక్రాంతికు వస్తే థియేటర్స్ ఎలా ఇవ్వగలుగుతాం అని అంటున్నారట.  ఈ క్రమంలో పోటీ ఎక్కువ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్  ఏ సినిమాకు ఎంత షేర్ వస్తుందనేది అంచనా వెయ్యలేక ఎక్కువ అడ్వాన్స్ లు ఇవ్వలేమని చెప్పేస్తున్నారట. ఎందుకంటే సరైన థియేటర్స్ దొరకవు. ప్రక్కన  పెద్ద స్టార్స్ పోటీ ఉన్నప్పుడు మేనేజ్ చేయటం కష్టమని చేతులు ఎత్తేస్తున్నారట. నిర్మాతలు తాము చాలా భారీ మొత్తాలు సినిమాలపై ఇన్వెస్ట్ చేసామని, ఇలాంటి సమయంలోనే ఒకరినొకరు సాయిం చేసుకుని ఎడ్జెస్ట్మెంట్స్ చేసుకోపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పోటీతో తమకు రావాల్సిన అడ్వాన్స్ లు రావటంలేదని ,నష్టపోతున్నామని, అందరూ వేలెత్తి మైత్రీ మూవీస్ వైపే చూపెడుతున్నారు. ఈ క్రమంలో ఎలా సర్ది చెప్పాలి అనే విషయమై మైత్రీ మూవీ మేకర్స్ వారు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios