KGF 3: ఇదేం ట్విస్ట్...ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా...నీల్ ఏం చేస్తారో?

 కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి చాఫ్టర్ 3 ఏ స్దాయిలో వచ్చి రికార్డ్ లు క్రియేట్ చేస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
 

is KGF 3 is to begin before NTR  film!?


‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్దాయిలో చరిత్ర సృష్టించిందో తెలిసిందే.  భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన ఆల్ టైమ్ రెండవ హిందీ చిత్రంగా నిలిచింది.  రీసెంట్ గా అన్ని భాషల్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ లాభాలను తెచ్చిపెట్టిన భారీ సినిమా ఇది. ‘కేజీఎఫ్’ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ని నిర్మాత క్యాష్ చేసుకోవాలనుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు అదే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.కానీ ఆ ప్రయత్నాలు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు అడ్డుపడతాయేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

 ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ త్వరలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా "సలార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హొంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు విజయ్. "ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ 35 శాతం పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చేవారం సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. ఆ తరువాత కే జి ఎఫ్ 3 ప్లాన్ చేస్తున్నాం. 2024 లో కే జి ఎఫ్ 3 విడుదల అవుతుంది. కేజిఎఫ్ ను మార్వెల్ యూనివర్స్ లాగా మార్చాలని అనుకుంటున్నాం" అని చెప్పుకొచ్చారు విజయ్‌ కిరంగదూర్‌. 

మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనే టెన్షన్ ఈ మాటలతో ప్రారంభమైంది.  ఈ ఏడాదిలోనే ‘కేజీఎఫ్ 3’ లాంచ్ అవుతుందని నిర్మాత విజయ్ కిర్గందూర్ తెలిపారు. 2023లో ప్రభాస్ ‘సాలార్’, 2024లో ‘కేజీఎఫ్ 3’ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సంవత్సరం నుండి KGF 3 తో ​​బిజీగా మారినట్లయితే, ఆయన త్వరలో ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించటం కష్టం. 2023 చివరలో మాత్రమే   ఎన్టీఆర్ చిత్రాన్ని మాత్రమే మొదలెట్టేటట్లు కనిపిస్తోంది. కాబట్టి, నీల్ సినిమా (#NTR31) కోసం ఎన్టీఆర్ ఎక్కువ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.

 కన్నడ రాక్ స్టార్ యష్(Yash )నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సినిమాతో యష్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమా కూడా  భారీ విజయాన్ని అందుకుంది. చాఫ్టర్ 1 కంటే చాఫ్టర్ 2 గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. అన్ని రికార్డ్స్ ను ఈ సినిమా బ్రేక్ చేసింది. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి చాఫ్టర్ 3 ఏ స్దాయిలో వచ్చి రికార్డ్ లు క్రియేట్ చేస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios