#ThankYou:దిల్ రాజు పబ్లిసిటీ జిమ్మిక్కా ? టిక్కెట్ రేట్లు తగ్గింపు ఏది

థాంక్యూ మూవీ టికెట్ ధర సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు+ జీఎస్టీ కాగా తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు + జీఎస్టీగా ఉంది. సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే థాంక్యూ సినిమా ప్రదర్శించబడుతోంది అన్నారు. అయితే టిక్కెట్స్ బుక్కింగ్స్ ఈ రోజు ప్రారంభమయ్యాయి. 

  Is it publicity Gimmick from Dil Raju?!

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో థియేటర్లలో పెద్ద సినిమాలకు కూడా మినిమం ఓపినింగ్స్ రావటంలేదు.  ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటంతో నిర్మాత దిల్ రాజు తక్కువ టికెట్ రేట్లకు థాంక్యూ సినిమా ప్రదర్శితం అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటన చేసారు. నైజాంలో థాంక్యూ మూవీ టికెట్ రేట్లను ఊహించని స్థాయిలో తగ్గించామని చెప్పారు. 
#ThankYouTheMovie

థాంక్యూ మూవీ టికెట్ ధర సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు+ జీఎస్టీ కాగా తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు + జీఎస్టీగా ఉంది. సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే థాంక్యూ సినిమా ప్రదర్శించబడుతోంది అన్నారు. అయితే టిక్కెట్స్ బుక్కింగ్స్ ఈ రోజు ప్రారంభమయ్యాయి. కానీ టిక్కెట్ రేట్లు తగ్గించిన దాఖలా కనపడటం లేదని సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ లు పెడున్నారు. 

 హైదరాబాద్ లో సింగిల్ స్కీన్స్  ₹175 వరకూ, మల్టిప్లెక్స్ లు ₹250!రేట్లు ఉండటం తో ఎక్కడ రేట్లు తగ్గాయి అని అడుగుతున్నారు.
ఇది దిల్ రాజు పబ్లిసిటి జిమ్మిక్కు అంటున్నారు. గతంలో అంటే సుందరానికి సినిమా టైమ్ లో టిక్కెట్ రేట్లు తగ్గించామన్నారు. కానీ జరగలేదు. ఇది అంతే అని తేల్చేస్తున్నారు. ఏపీలో థాంక్యూ టికెట్ రేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.  
#ThankYouTheMovie

 సినిమాలో నాగచైతన్య పాత్రను చాలా వైవిధ్యంగా డిజైన్ చేసినట్లుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్యూ చిత్ర రన్‌టైమ్ 2 గంటల 9 నిమిషాలకు లాక్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఈ రన్‌టైమ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. 

అటు ఈ సినిమాలో చైతూ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అభిమానిగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో చైతూ సరసన అందాల భామలు రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌లు నటిస్తుండగా, ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నాడు. మరి ‘థ్యాంక్యూ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాలంటే జూలై 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios