#Balakrishna:సంక్రాంతి రేసులో బాలయ్యకు దెబ్బ?ఫ్యాన్స్ ఊరుకుంటారా

మేజర్ సిటీలలో థియేటర్స్ తగ్గితే రెవిన్యూ  పడిపోతుంది. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా బాలయ్య సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం కష్టం కాదు

Is Balakrishna Losing In Sankranthi 2023 Race?

2023 సంక్రాంతి సీజన్ లో ఎప్పటిలాగే పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆదిపురుష్ ఈ పోటీ నుండి తప్పుకుంది. అయినా కూడా మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి మధ్యనే పోటీ ఉండబోతోంది. దాంతో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన రచ్చ మామూలుగా లేదు.

అలాగే  రెండూ మైత్రీ బ్యానర్ నుంచి వచ్చినవే. ఈ రెంటిలో ఏదీ ప్రక్కన పెట్టే పరిస్దితి లేక రెండు సంక్రాంతికే తెస్తున్నారు నిర్మాతలు ఇక  ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమా ‘వరిసు’ కూడా రిలీజ్ కాబోతుంది. విజయ్ హీరోగా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  వారసుడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ టైమ్ లో ఖచ్చితంగా థియేటర్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది.ఎలా ఎడ్జెస్ట్ చేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య చిత్రానికి ఈ థియేటర్స్ ఎలాట్మెంట్ లో అన్యాయం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...వైజాగ్ లో వారసుడు చిత్రానికి  ఆరు థియేటర్స్, వాల్తేర్ వీరయ్య సినిమాకు నాలుగు కేటాయించగా, వీరసింహారెడ్డి చిత్రానికి కేవలం రెండు థియేటర్స్ మాత్రమే ఎలాట్ చేసారని తెలుస్తోంది. మేజర్ సిటీలలో థియేటర్స్ తగ్గితే రెవిన్యూ  పడిపోతుంది. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా బాలయ్య సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ఇక ఈ సీజన్‌లో చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు లైన్‌లో ఉండటంతో బి, సి సెంటర్లలో విజయ్ సినిమాని ఎగ్జిబిటర్లు సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా లేరు. దిల్ రాజు నైజాంలో మార్కెట్‌ను శాసిస్తారు. అక్కడ కావాల్సిన థియేటర్స్ వేసుకోగలరు. కానీ అయితే ఇది డిస్ట్రిబ్యూటర్ గా ఆనందం కలిగించినా, నిర్మాతకు సమస్యగా మారనుంది. తెలుగు సినిమా  స్టార్ హీరోలందరితో పనిచేసిన దిల్ రాజు త్వరలో చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. చేస్తారు కూడా..అలాగే వారి వారసులతోనూ సినిమాలు చేస్తారు. ఈ సిట్యువేషన్ లో తన సినిమా కోసం స్క్రీన్స్ బ్లాక్ చేస్తే ఆ హీరోలకు, వారి అభిమానులకు కోపాలు వస్తాయి అన్నది తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios