Vaishnav Tej:వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ..కవితాత్మకం

   అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించిన గీరిషయ్య వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం రూపొందిస్తున్నాడు. 'రొమాంటిక్' బ్యూటి కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
 

Intresting Title For Vaishnav Tej


తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్​బస్టర్ విజయం అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' చిత్రంలో ఇతడి నటనకు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఆ సినిమా విడుదలకాకముందే క్రిష్ దర్శకత్వంలో  'కొండపొలం'  సినిమాకు ఓకే చెప్పేసి పూర్తి చేసి రిలీజ్ చేసాడు. తాజాగా తన మూడో చిత్రానికి సిద్ధమయ్యాడు.   అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించిన గీరిషయ్య వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం రూపొందిస్తున్నాడు. 'రొమాంటిక్' బ్యూటి కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాకు 'రంగ రంగ వైభవంగ', 'ఆబాల గోపాలం' అనే టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఎక్కువగా అందరి దృష్ఠి 'రంగ రంగ వైభవంగ' మీదే ఉన్నట్టు తెలుస్తోంది. మరి చిత్ర టీమ్  ఏ టైటిల్‌ను ప్రకటిస్తారో చూడాలి. శోభితా రానాను సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు. ఆమె ఈ చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.  ఈ  రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెట్స్‌లో చేరిన నటి శోభితా రానా ఈ సినిమా అవకాశం గురించి హ్యాపీగా ఉన్నారు. శోభితా రానా హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ఇప్పుడు ఆమె తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవడానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.   

ఇదిలా ఉండగా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమాపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాతలు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో తన 16వ సినిమాను వైష్ణవ్ హీరోగా, ఫార్చ్యూన్ బ్యానర్ తో కలిసి నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను త్వరలోనే వెల్లడించనున్నారు ప్రకటించారు.

Also Read :Vaisshnav Tej Birthday: 'నేను ఆసుపత్రిలో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు'.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios