Asianet News TeluguAsianet News Telugu

గోపిచంద్ దే ధైర్యం, ప్రభాస్ కు డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ కు ఛాన్స్

ఆ  సినిమా ప్రభాస్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. రాధే శ్యామ్. ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలై...

Gopichand Reunites With Disaster Director radhakrishna After 8 Years jsp
Author
First Published Sep 20, 2023, 6:40 AM IST

సాధారణంగా హిట్ దర్శకులతో సినిమాలు చేయటానికి హీరోలు ఉత్సాహం చూపిస్తూంటారు. అదేంటో గోపిచంద్ రివర్స్ లో వెళ్తున్నారు. తన మీద తనకు నమ్మకమో మరేమో కానీ గోపిచంద్ రీసెంట్ గా శ్రీను వైట్లతో సినిమా లాంచ్ చేసారు. శ్రీను వైట్ల వరస డిజాస్టర్స్ తో దూసుకెళ్లి గ్యాప్ వచ్చింది. సరే ఆయన ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదు కాబట్టి ఆఫర్ ఇచ్చారనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు మరో డిజాస్టర్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చారు. ఆ దర్శకుడు మరెవరో కాదు రాధాకృష్ణ కుమార్. 

రాధాకృష్ణ మరెవరో కాదు...ప్రభాస్ తో రాధేశ్యామ్ మూవీ చేసారు గుర్తుందా. ఆ  సినిమా ప్రభాస్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. రాధే శ్యామ్. ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందరినీ తీవ్రంగా నిరాశపరించింది. దాదాపు 100 కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఏ హీరోతోనూ రాధాకృష్ణ సినిమా ఓకే చేయించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు.

Gopichand Reunites With Disaster Director radhakrishna After 8 Years jsp

 అయితే అతనికి మొదటి నుంచి ప్రభాస్ సపోర్ట్ ఉండటంతో  గోపిచంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ లోనే మూడో సినిమా చేసే ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్   స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్ కి రాధాకృష్ణ కథ కూడా చెప్పడం,నచ్చటం జరిగిందని వినికిడి.  త్వరలో దీనికి సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉంది. మొత్తానికి డిజాస్టర్స్  సినిమాలు చేసే వెనుకబడిపోయిన దర్శకులకి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి గోపీచంద్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నట్లు ఉన్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైతేనేం నవ్విన నాపచేను పండినట్లుగా...గోపిచంద్ ఈ డిజాస్టర్స్ కాంబినేషన్స్ లోనే హిట్ కొడతాడేమో చూడాలి.  గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'జిల్' సినిమాని రాధాకృష్ణ డైరక్షన్ లోనే  యువి క్రియేషన్స్ (UV Creations) నిర్మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios