Acharya :"ఆచార్య" కు జెమినీ ఛానెల్ ట్విస్ట్,తల పట్టుకున్న కొరటాల?
తాజాగా ఆచార్య సినిమాకు మరొక సమస్య వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సారి శాటిలైట్ రైట్స్ తీసుకున్న జెమెనీ ఛానెల్ నుంచి సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.
చిరంజీవితో చేసిన ఆచార్య సమస్యలు కొరటాలను ఇంకా విడిచిపెట్టలేదు. సీడెడ్ కు ఐదు కోట్లుతో సెటిల్మెంట్ చేయటంతో తీరిపోయాయి అని రిలీఫ్ అయ్యినంత సేపు పట్టలేదు. మరో వైపు నుంచి సమస్య ప్రారంభమైందని సమాచారం. అది శాటిలైట్ రైట్స్ తీసుకున్న జెమినీ ఛానెల్ నుంచి అంటున్నారు. ఈ సినిమాని జెమినీ వారు 15 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు సినిమా డిజాస్టర్ అయ్యాక...తమను రేటు అయినా తగ్గించి, రీఎగ్రిమెంట్ చేయటమో లేక అఢ్వాన్స్ తిరిగి ఇచ్చి ఎగ్రిమెంట్ కాన్సిల్ చేయటమో చేయమని అడుగుతున్నారట.
అందుకు కారణంగా సినిమా ప్లాఫ్ అనే విషయం కాకుండా మొదట అనుకున్నట్లు గా కాజల్ లేకపోవటాన్ని వేలెత్తి చూపుతోందని చెప్తున్నారు. దాంతో ఇప్పటికిప్పుడు వేరే ఛానెల్ వారు తీసుకోరు. మరి ఏం చేయాలి అంటే 15 కోట్లలో సగం రేటు ఇస్తామని జెమెనీ వారు చెప్తున్నారు. దానికే ఓకే చెప్పాల్సిన సిట్యువేషన్. ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో కొరటాల ఇరుక్కుపోయారంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఒక్కో సినిమా ఒక్కో పాఠం నేర్పుతుంది. ముఖ్యంగా ఫ్లాఫ్ సినిమా కర్ర పెట్టుకుని కూర్చోబెట్టి మరీ పాఠాలు చెప్తుంది. ఇప్పుడు ఆచార్య తర్వాత కొరటాల శివ పరిస్దితి అలాగే ఉంది. తన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. దాంతో ఆయన ఆలోచనలో పడిపోయారు. మెసేజ్ మోజులు పడి మాస్ ఎలిమెంట్స్ ని మర్చిపోయారనే విమర్శలు ఆయన చెవిని పడ్డాయి. దాంతో తన తదుపరి చిత్రానికి కొరటాల శివ మాస్ కోణంలో ఆవిష్కరించనున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ నెక్ట్స్ సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు.వాస్తవానికి కొరటాల శివ ఎన్టీఆర్ తో ఒక పొలిటికల్ సినిమా చేయాలని అనుకున్నారు. అందులో ఎన్టీఆర్ ని ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో చూపించాలని అనుకున్నారు. ఇంతకుముందు సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా సోషల్ మెసేజ్ ఉంటుందేమోనని అభిమానులు అనుకున్నారు. అయితే "ఆర్ఆర్ఆర్", "కేజిఎఫ్" వంటి సినిమాలు చూసిన కొరటాల శివ ఎంటర్టైన్మెంట్ కి ఈ సినిమాలో పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమాలో కూడా మాస్ ఎలిమెంట్లు, ఎలివేషన్లు అదిరిపోయే డైలాగులతో సినిమా తీయాలని అనుకుంటున్నారట. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాతో కొరటాల ఎంత వరకు మెప్పిస్తారో వేచి చూడాలి.