Allu aravind: గీతా ఆర్ట్స్ లో ఈ యంగ్ హీరో కు ఊహించని ఛాన్స్ , పెద్ద షాకే
పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ డేట్స్ ని బ్లాక్ చేసింది గీతా ఆర్ట్స్. ఆ సంస్ద నుంచి వచ్చిన గీత గోవిందం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది.
నిర్మాతగా అల్లు అరవింద్ కు ఉన్న విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా కాంపౌండ్ నిర్మాణంలో ఆయన పాత్ర సామాన్యమైనది కాదు. అలాగే చిరంజీవి కెరీర్ కు కూడా ఆయన ప్లానింగ్ చాలా వరకూ ఉపయోగపడిందని చెప్తారు. మొన్నటికి మొన్న ఆహా ఓటిటి ని పెట్టి తెలుగులో నెంబర్ వన్ స్దాయికి తీసుకువెళ్తున్నారు. తగ్గేదేలే అన్నట్లు ఆయన దూసుకుపోతున్నారు. ఆయన స్ట్రాటజీలు మిగతా నిర్మాతలకు ప్రేరణగా ఉంటాయి. ముఖ్యంగా ఏ హీరో షైన్ అవుతారో ...భవిష్యత్తుని ఊహించి, వాళ్ళ డేట్స్ ముందే తీసుకుని తమ బ్యానర్ లో సినిమా చేస్తారు.
అలా అంతకు ముందు పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ డేట్స్ ని బ్లాక్ చేసింది గీతా ఆర్ట్స్. ఆ సంస్ద నుంచి వచ్చిన గీత గోవిందం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన చిత్రం అవడంతో, తక్కువ సమయంలో ₹ 100 కోట్ల వసూళ్లను వసూలు చేసిన చిత్రంగా మారింది.
అలాగే RX100 సినిమా సూపర్ సక్సెస్ తర్వాత GA కార్తికేయ రెడ్డికి అడ్వాన్స్ చెల్లించి అతనితో చావు కబురు చల్లగా తీసారు. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఇక మరో హీరో కిరణ్ అబ్బవరంపై కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేసారు. అతి , త్వరలో గీతా ఆర్ట్స్ లో కిరణ్ తో రూపొందే వెంచర్ ప్రారంభం కానుంది.
ఇక ఈ వారం రిలీజైన అశోక వనంలో అర్జున కళ్యాణం యొక్క టాక్ గురించి తెలుసుకున్న తర్వాత, అరవింద్... విశ్వక్సేన్ కోసం కూడా ఒక పార్టీ ఇచ్చారని సమాచారం. ఈ యువ హీరో త్వరలో GA2 ద్వారా గీతా ఆర్ట్స్ కోసం సంతకం చేయనున్నాడని తాజా సంచలనం. ఇలా యంగ్ హీరోలందరికీ గీతా కాంపౌండ్‌లో ఒక్కో సినిమా ఉండేలా అరవింద్ సరైన వ్యూహాలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్కటి క్లిక్ అయినా ప్రొడక్షన్ హౌస్ కు, ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది.