బాలయ్యనే కాదు...క్రిష్ ని ఈ గాసిప్ లోకి లాగారే
ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మించడంలో అల్లు అరవింద్ బిజీగా ఉన్నారు. అలాగే ఓటీటీ కంటెంట్ ను సెట్ చేసే పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు.
స్టార్ హీరో బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నారు. బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చేస్తుండగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని క్రేజీ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. క్రిష్.. బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు తీశారు. మరోసారి క్రిష్, బాలకృష్ణ కలిస్తే మాత్రం మంచి ఎక్సపెక్సటేషన్స్ ఉంటాయి! అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మరో ప్రక్క ఇది రూమర్ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. బాలయ్య చేస్తున్న షో ని బేస్ చేసుకుని ఈ గాసిప్ రెడీ చేసారంటున్నారు.
కర్టైన్ రైజర్ లో వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ, అల్లు ఫ్యామిలీతో తమకి గల అనుబంధాన్ని చెప్పడంతో, ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే ప్రచారం బలం పుంజుకుంటోంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మించడంలో అల్లు అరవింద్ బిజీగా ఉన్నారు. అలాగే ఓటీటీ కంటెంట్ ను సెట్ చేసే పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ పనులు ఒక కొలిక్కి వచ్చాక బాలకృష్ణతో సినిమా మొదలవుతుందని గట్టిగానే చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.
బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చిత్రంలో నటిస్తున్నారు. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకుముందు 'సింహా', 'లెజెండ్' చిత్రాలతో బ్లాక్బస్టర్లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది