#RC15:ఈ వార్త నిజమైతే ...రామ్ చరణ్ ఫ్యాన్స్ గోలెత్తిపోతారు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తన 50 వ చిత్రం గా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..పొలిటికల్ నేపథ్యం లో సాగే సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం కి పైగా పూర్తి అయ్యినట్టు సమాచారం..
ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా రిలీజ్ బాగా లేటవుతుందని చెప్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని సంక్రాంతి 2024 కి రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. మొదట RC15 ని సంక్రాంతి 2023కు రిలీజ్ చేసే ప్లాన్ చేసారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవటంతో అది 2023 సమ్మర్ కు అనుకున్నారు. కానీ అనుకోని విధంగా శంకర్ ..ఇండియన్ 2 చిత్రాన్ని సీన్ లోకి తేవటంతో మొత్తం మారిపోయింది. శంకర్ మొదట ఈ రెండు చిత్రాలపై ఒకేసారి పని చేద్దామనుకున్నాడు. కానీ కానీ ఇప్పుడు దృష్టి మొత్తం ఇండియన్ 2 ప్రాజెక్టు పై పెట్టారు. ఎక్కువ శాతం ఇండియన్ 2 సెట్స్ మీదే గడుపుతున్నారు.
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇండియన్ 2 చిత్రాన్ని 2023 దసరాకు రిలీజ్ చేయనున్నారు. అప్పుడు RC15 రిలీజ్ మరింత ముందుకు వెళ్లి 2024 సంక్రాంతికి విడుదల అవుతుందని చెప్తున్నారు. ఇది మెగా ఫ్యాన్స్ ని ఆందోళన పరిచే విషయమే. అయితే ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. అలాగే దిల్ రాజు లాంటి నిర్మాత అంత కాలం ఓ భారీ బడ్జెట్ సినిమాని రిలీజ్ కు రెడీ చేయకపోతే ఫైనాన్స్ పరంగా బాగా నష్టపోతాడు. కాబట్టి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇండియన్ 2 హిట్ అయ్యిన తర్వాత శంకర్ సినిమాని మార్కెట్ చేయటం చాలా ఈజీ. మంచి రేట్లు పలుకుతాయనేది నిజం. ఈ రకంగా ఆలోచిస్తే..నష్టం అనిపించకపోవచ్చు. చూడాలి మరి ఈ సినిమాని ఎప్పటికి రిలీజ్ చేస్తారో...దిల్ రాజు, రామ్ చరణ్ ఏం నిర్ణయం తీసుకుంటారో, శంకర్ ఏమంటారో..
ఇక ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్..కొన్ని తప్పని సరి పరిస్దితుల్లో ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ వినిపించాయి.