Asianet News TeluguAsianet News Telugu

#Agent:రీషూట్ చేద్దామని సురేంద్రరెడ్డి, నాగ్ మాత్రం .....

అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో   విడుదల కానుంది. 

director Surender Reddy wants to go for Agent reshoot?
Author
Hyderabad, First Published Aug 21, 2022, 2:43 PM IST


అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత సరైన సక్సెస్ ఇప్పటిదాకా రాలేదనే చెప్పాలి.  ప్లాఫ్ లేదా ఏవరేజ్ అన్నట్లుగా ఆడాయి. ఎట్టకేలకు తన నాల్గో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది.ఆ హిట్ ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ హీరో. తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 

దర్శక,రచయిత వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే....ఈ సినిమా రషెష్ చూసిన సురేంద్రరెడ్డి, కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. అయితే నిర్మాతలు, హీరో తండ్రి నాగార్జున ఈ సీన్స్ నిచూసి బాగున్నాయని..రీషూట్ అవసరం లేదని చెప్పారట. అయితే సురేంద్రరెడ్డి మాత్రం తను పూర్తిగా సంతృప్తిపడే దాకా ఓకే చెయ్యలేనని చెప్పేసారట. ఇది ఓ ప్రక్కన అఖిల్ కు ఆనందం కలిస్తోందిట. మరో ప్రక్క సినిమా లేటు అవుతుందని బాధపడుతున్నారట. 

ఇక రీసెంట్ గా  ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ అక్కినేని ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ అనే చెప్పాలి. ఆ రేంజ్ లో ఉంది. 'ది మోస్ట్ నోటోరియస్.. మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఈ పదాలతో అఖిల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఫుల్ యాక్షన్ సీన్స్ తో టీజర్ ని నింపేశారు. 

హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్  విడుదల తేదీ సరిగ్గా కన్ఫర్మ్ కావటం లేదు. మరో సారి  వాయిదా పడుతుందని టాక్. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. ఈ సినిమా మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios