#Salaar:'సలార్' పై వైరల్ న్యూస్, నమ్మేటట్లు లేదే
ప్రభాస్ చేసిన పాన్ ఇండియా సినిమాలు సాహో (saaho), రాధేశ్యామ్ (Rdhe Shyam) ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోలేకపోయాయి. అయినా కూడా ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ లిస్టులో ఉన్న చిత్రాల్లో ‘సలార్’ (Salaar) ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం.. ప్రభాస్ ఒకటైతే.. మరో కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కె.జి.యఫ్ (KGF)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సలార్. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా చరిత్ర సృష్టించడంతో సలార్ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. సలార్ అప్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులు కోసం అన్నట్టుగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త చూస్తూంటే నమ్మబుద్ది కావటం లేదు.
అది ఏంటంటే… కమల్ హాసన్ రీసెంట్ సూపర్ హిట్ విక్రమ్ సినిమాలో చివరి పది నిమిషాల్లో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ సినిమాకి ఆ పాత్ర మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ సీన్ థియేటర్ లో వచ్చినపుడు ప్రేక్షకుల స్పందన అంతా ఇంతా కాదు. అయితే సాలార్ సినిమాలో కూడా అదే తరహాలో క్లైమాక్స్ లో అందరినీ ఆశ్చర్య పరిచే ట్విస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఆ పాత్ర ఒక స్టార్ హీరో చేస్తాడని అతనెవరో కాదని... కేజిఎఫ్ నుంచి రాకీ భాయ్ అంటున్నారు. అయితే ఇంతలా అందరికీ అర్దమయ్యే ట్విస్ట్ ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా పెట్టరు. అదీ ఓ సూపర్ హిట్ సినిమాని అనుకరించి ట్విస్ట్ లు పెట్టుకునే స్దాయిలో ఆయన లేరు. ట్విస్ట్ ఉంటుంది కానీ ఖచ్చితంగా ప్రెష్ గా ఉంటుంది. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.
మరో ప్రక్క సాలార్ సినిమాని ఇదివరకు 2023 వేసవిలో విడుదల చేద్దామనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నా.. షూటింగ్ అనుకున్నంత త్వరగా అవకపోవడం వంటి కొన్ని కారణాల వలన దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు అని తెలుస్తోంది. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
జగపతిబాబు ఇందులో ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఆలస్యం అయ్యింది. త్వరలో సలార్ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.