Parasuram : డైరెక్టర్ పరుశురామ్ కి వేరే ఆప్షన్ లేదా..నెక్ట్స్ ఆ హీరోతో చెయ్యాల్సిందేనా?
‘సర్కారు వారి పాట’ చిత్రం డివైడ్ టాక్ అందుకుంది. అయితే కలెక్ష న్స్ విషయంలో తిరిగులేదు. ఈ నేపధ్యంలో పరుశురామ్ తో పనిచేయటానికి చాలా మంది స్టార్స్ ఉత్సాహం చుూపెడుతున్నారు. అయితే పరశురామ్ నాగ చైతన్యతోనే సినిమా చేస్తారని తెలుస్తోంది.
గత వారం రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో డైరక్టర్ పరుశురామ్ పేరు మారు మ్రోగిపోతోంది. సూపర్ స్టార్ మహేష్ ని డైరక్ట్ చేసి విజయం సాధించిన ఆయన నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ‘గీత గోవిందం’ ఘనవిజయం తర్వాత దర్శకుడు పరశురామ్ పెద్ద హీరోని డైరెక్ట్ చేయాలని చాలా కాలంగా వెయిట్ చేశాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు.
ఆ క్రమంలోనే అతను నాగ చైతన్యను కలుసుకున్నాడు మరియు 'నాగేశ్వరరావు' అనే చిత్రానికి అతని అనుమతి పొందాడు. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా, మహేష్ బాబు నుంచి పరశురాంకు కాల్ వచ్చింది. అలా ‘సర్కారు వార పాట’ జరిగింది. ఇప్పుడు, ఈ చిత్రం డివైడ్ టాక్ అందుకుంది. అయితే కలెక్ష న్స్ విషయంలో తిరిగులేదు. ఈ నేపధ్యంలో పరుశురామ్ తో పనిచేయటానికి చాలా మంది స్టార్స్ ఉత్సాహం చుూపెడుతున్నారు. అయితే పరశురామ్ నాగ చైతన్యతోనే సినిమా చేస్తారని తెలుస్తోంది.
మహేష్ ని మించిన పెద్ద స్టార్‌లెవరూ పరశురామ్‌తో వెంటనే పనిచేయరు. చేద్దామనుకున్నా చాలా టైమ్ పడుతుంది. అందరూ బిజీగా ఉన్నారు. అందుకే నాగ చైతన్యతో ‘నాగేశ్వరరావు’ సినిమాను మళ్లీ తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడు. అయితే పరశురామ్ ప్రపోజల్ పై నాగ చైతన్య ఎలా రెస్పాండ్ అవుతాడో వేచి చూడాలి. నాగ చైతన్య ప్రస్తుతం 'ధాంక్స్', 'లాల్ సింగ్ చద్దా' ,వెబ్ సిరీస్ 'దూత' పూర్తి చేసాడు.అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. అయినా ఈ గ్యాప్ లో పరుశురామ్ తో చేసే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం.
ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు.