Nithin:ఈవెంట్ లో డైరక్టర్ మిస్, ఆ భయంతోనే రాలేదా?

డైరక్టర్ ని ఈవెంట్ రావద్దని చెప్పారని తెలుస్తోంది.  స్టేజీపైనా కూడా ఎక్కడా డైరక్టర్ పేరు ఎత్తలేదు. ఇప్పటికే ఈ సినిమా బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండ్ నడుస్తోంది. ఈ వివాదాన్ని ఇంకా పెంచితే మొదటికే మోసం వస్తుందని కావాలనే డైరక్టర్ ని ఈ పంక్షన్ కు దూరం పెట్టారని వినపడుతోంది.

Director is missing Macherla Niyojakavargam trailer launch


నితిన్ కి కొంతకాలంగా హిట్టు అనేది లేదు.  ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో ఆయన 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేశాడు. పొలిటికల్ టచ్ తో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సుధాకర్ రెడ్డి - నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను 'గుంటూరు'లో నిర్వహించారు. అయితే ట్రైలర్ లాంచ్ లో డైరక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. అయితే అందుకు కారణం అందరికీ తెలిసిందే.

 రాజశేఖర్ రెడ్డి గతంలో ట్విట్టర్ లో రెండు కులాలని కించపరుస్తూ చేసిన కొన్ని వివాదాస్పదమైన ట్వీట్  కామెంట్స్ వైరల్ గా మారాయి. ఐతే ఇదంతా తప్పుడు ప్రచారమని, కావాలనే తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ కేసు కూడా పెట్టాడు రాజశేఖర్.  ఈ విషయమై నితిన్ సైతం ట్వీట్ చేసాడు. కానీ అందరూ రాజశేఖర్ రెడ్డిని తప్పుపడుతున్నారు. ఈ నేపధ్యంలో మరింత డ్యామేజ్ జరగకుండా చెక్ పెట్టాలని నితిన్ భావించినట్లున్నారు. ఈ మేరకు డైరక్టర్ ని ఈవెంట్ రావద్దని చెప్పారని తెలుస్తోంది. 

స్టేజీపైనా కూడా ఎక్కడా డైరక్టర్ పేరు ఎత్తలేదు. ఇప్పటికే ఈ సినిమా బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండ్ నడుస్తోంది. ఈ వివాదాన్ని ఇంకా పెంచితే మొదటికే మోసం వస్తుందని కావాలనే డైరక్టర్ ని ఈ పంక్షన్ కు దూరం పెట్టారని వినపడుతోంది. అందులోనూ ట్రైలర్ లాంచ్ జరిగిన గుంటూరులో ఓ సామాజిక వర్గంది పై చేయి. దాంతో అక్కడ రచ్చ జరిగే అవకాసం ఉందని కూడా వారు భావించినట్లు చెప్పుకుంటున్నారు. డైరక్టర్ ట్విట్టర్ లో తన ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ కు రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు.
 
మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయన్స్ గా కృతి శెట్టి .. కేథరిన్ అలరించనున్నారు. ఈ సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి చీఫ్ గెస్టుగా ఈ వేడుక జరిగింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios