Mokshagna:మోక్షజ్ఞ లాంచింగ్ కు రంగం సిద్దం, డైరక్టర్ ఫైనల్

బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి' తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు ఎదురుచూపులే మిగిలాయి. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ప్రకటించి అభిమానులకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం ఆ వైపుగా అడుగులేస్తున్నట్లు సమాచారం.

Director Finalised For Nandamuri Mokshagna Debut


బాలకృష్ణ ఈ   తరం హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలసిందే. రీసెంట్ గా అఖండ చిత్రంతో ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తన్నారు. అప్పుడు ...ఇప్పుడు అంటున్నా ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతోంది. ఈ క్రమంలో బాలయ్య తన వారసుడు ఎంట్రీ కోసం డైరక్టర్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. 

బాలయ్య బాబు సినీ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన కొడుకు మోక్షజ్ఞ సినీ గడప తొక్కబోతున్నాడంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం నడుస్తోంది. కానీ ఇప్పటికీ ఆయన తొలి సినిమాపై అధికారిక సమాచారం అయితే రాలేదు. బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి' తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు ఎదురుచూపులే మిగిలాయి. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ప్రకటించి అభిమానులకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం ఆ వైపుగా అడుగులేస్తున్నట్లు సమాచారం.
 
ఇక ఆ మధ్యన మోక్షజ్ఞ లాంచ్‌ప్యాడ్ ప్రాజెక్ట్‌కి పూరి జగన్   దర్శకత్వం వహించనున్నారని వార్తలు  వచ్చాయి. అయితే పూరీ ఇతర కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటంతో అది కష్టమైపోయింది. అలాగే బాలయ్య బాబు హీరోగా వచ్చి అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'ఆదిత్య 369' సీక్వల్‌తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు.  ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా ఫినిష్ అయ్యింది. అదీ మెటీరియలైజ్ కాలేదు. మరో ప్రక్క  మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతను బోయపాటి తీసుకున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తనకు హాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాలని సెంటిమెంటల్‌గా బాలయ్య ఫిక్సయ్యారట. అది అదీ నిజం కాలేదు. దానికి తోడు మోక్ష కూడా  తన షేప్‌ను కూడా కోల్పోయాడు. 

అయితే తన తండ్రి సూచన మేరకు గత కొంతకాలంగా జిమ్ లో బాగా కష్టపడిన మోక్షజ్ఞ ఇప్పుడు ఫుల్ షేప్ కు వచ్చారట.  దీంతో త్వరలోనే అతని చిత్రం ప్రారంభం అవుతుందని క్లారిటీ వచ్చేసింది. మరి ఎవరు ఆ డైరక్టర్ అంటే...అనీల్ రావిపూడి అని తెలుస్తోంది.
 
అనీల్ రావిపూడి అయితే హీరోని సేఫ్ గా లాంచ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ...తన హీరోతో  కామెడీ నుండి ఫైట్స్ , రొమాన్స్ అన్నీ చేయిస్తూ ఉంటారు. కాబట్టి, మోక్షజ్ఞ ప్రతిభను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించాలంటే ఆ దర్శకుడే ఫెరఫెక్ట్ అని డిసైడ్ అయ్యారట. త్వరలో మొదలయ్యే ఈ చిత్రం కోసం బాలయ్య  ఎదురు చూస్తున్నాడు. ఈ రోజుల్లో, వారసత్వం కంటే, ప్రతిభ మాత్రమే యంగ్  హీరోలకు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మరియు బాక్సాఫీస్ వద్ద వారికి మార్కెట్‌ను సృష్టించడానికి సహాయపడుతుందని బాలయ్య బాగా నమ్ముతున్నారట.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios