Dil Raju : దిల్ రాజుకు జూలైలో అగ్ని పరీక్ష, ఏం జరుగుతుందో

 తెలుగులో ఘన విజయం సాధించిన జెర్శీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసారు.  అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర బాంబులా పేలింది.  షాహిద్ కపూర్ వంటి స్టార్ ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.20 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. 

Dil Raju locks and loads HIT release date


దిల్ రాజు అంటే సక్సెస్ కు మారు పేరు. ఆయన చేసిన ఏ సినిమా అయినా మాగ్జిమం వర్కవుట్ అవుతుంది. ఆయన నిర్మాతగా స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం తో పాటు సూపర్ స్టార్స్ తో సినిమాలు చేయటం ఆయనకు ఇష్టం. తెలుగులో సక్సెస్ ఫుల్ గా ఎదిగిన ఆయన రీసెంట్ గా హిందీలోకు ప్రవేశించారు. తెలుగులో ఘన విజయం సాధించిన జెర్శీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసారు.  అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర బాంబులా పేలింది.  షాహిద్ కపూర్ వంటి స్టార్ ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.20 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఓ రకంగా తొలి చిత్రంతో భారీ ఫ్లాఫ్ ని తన ఖాతాలో వేసుకున్నారు దిల్ రాజు. అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.

దిల్ రాజు తన రెండవ హిందీ ప్రొడక్షన్ HIT – The First Caseని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం కూడా అదే పేరుతో తెలుగులో హిట్ అయిన సినిమా ఆధారంగా రూపొందించబడింది.  శైలేష్ కొలను దర్శకత్వంలో హీరో నేచురల్ స్టార్ నాని ప్రశాంతి త్రిపిర్నేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కి సంచలన విజయాన్ని సాధించింది.

హీరోగా విశ్వక్ సేన్ ని కొత్త  స్టైల్ లో అవిష్కరించి అతనికి మంచి విజయాన్ని అందించింది. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే పపేరుతో రీమేక్ చేస్తున్నారు. రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కించారు. 'దంగల్' ఫేమ్  సాన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మా సినిమా థియేటర్లలోకి రాబోతోందని అయితే ముందు అనుకున్నట్టుగా కాకుండా కొత్త రిలీజ్ డేట్ తో జూలై 15న థియేటర్లలోకి రానుందని దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్  కుమార్ నిర్మించారు.  ఈ సినిమా ఫలితం బాలీవుడ్ నిర్మాతగా దిల్ రాజు కెరీర్‌ని డిసైడ్ చేస్తుంది. ఇది ఆయనకి అగ్నిపరీక్ష కానుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios