Rishabh Pant: బాలీవుడ్ బ్యూటీ కోసం 16 గంటలు వెయిట్‌ చేసిన రిషబ్‌ పంత్ ! కార‌ణ‌మ‌దేనా?

Rishabh Pant: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను క‌ల‌వ‌డానికి రిషబ్ పంత్.. ఏకంగా 16 గంటల పాటు ఎదురు చూశాడ‌ట‌. ఊర్వశి తన సినిమా ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం వారణాసిలో షూటింగ్‌ చేస్తుందట. అత్యంత‌ టైట్‌ షెడ్యూల్ ఉండ‌టంతో త‌న బాయ్ ప్రెండ్‌ రిషబ్ ను కూడా వేట్ చేయించింద‌ట‌. 
 

Cricketer Rishabh Pant Weight For 16 Hours To Meet Urvashi Rautela

Rishabh Pant: రిష‌బ్ పంత్ టీమిండియాలో ప‌రిచ‌యం అక్క‌ర‌ల్లేని పేరు. త‌న‌దైన బ్యాటింగ్ శైలితో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతూ.. టీమిండియాలో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సాధించాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ.. అప్ క‌మింగ్ క్రికెట‌ర్ల‌కు స్ఫూర్తినిస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ‌త కొంత కాలంగా..  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, భారత క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక న్యూస్ బీటౌన్‌లోనూ, అటు క్రికెట్ వ‌ర్డ‌ల్ లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. 

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను మీట్ కావ‌డానికి రిషబ్ పంత్.. దాదాపు 16 గంటల పాటు ఎదురు చూసినట్లు సమాచారం. ఊర్వశి తన సినిమా ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం వారణాసిలో షూటింగ్‌ చేస్తుందట. అత్యంట టైట్‌ షెడ్యూల్ ఉండ‌టంతో ఎవ్వ‌రిని  కూడా క‌లువలేకపోతుంద‌ట‌. కనీసం త‌న బాయ్ ప్రెండ్‌ రిషబ్ వ‌చ్చిన క‌లువ‌లేక‌పోయింద‌ట‌. దీంతో ఊర్వ‌శిని కలిసేందుకు వెళ్లిన రిషబ్ సుమారు 16-17 గంటలు నిరీక్షించినట్లు బీటౌన్ టాక్. కాగా వీరిద్దరికి కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా ఇప్పటికీ బయటకు రాలేదు. వీరిద్ద‌రూ నిజంగానే ప్రేమలో ఉన్నట్లయితే వారిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేది క‌దా అనే మరో టాక్. 

ఇదేమైనా..   బాలీవుడ్ హీరోయిన్ల‌తో క్రికెటర్ల ప్రేమాయాణాలు కొత్తేమి కాదు. చాలా కాలం డేటింగ్ లో ఉన్నావారు ఉన్నారు. ఇంకో అడుగు ముందుకేసి తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లినా వారు ఉన్నారు. గాసిప్స్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీకి సర్వసాధారణమే. కాగా కొందరి సెలబ్రిటీల్లో వచ్చిన ప్రేమ, పెళ్లి గాసిప్స్‌ సైతం పుకార్లులానే మిగిలిపోయాయి. ఈ పద్ధతి ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న సంప్రదాయం ఇది.

బాలీవుడ్ హీరోయిన్ల‌ను పెళ్లి చేసుకున్న బాబితాలో అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా – నటాషా స్టాన్కోవిక్,  మొహసీన్ – రీనా, సంగీత – అజారుద్దీన్,  జహీర్ ఖాన్ – సాగరిక,  యువరాజ్ – హెజెల్ కీచ్,  హర్భజన్ – గీతా బస్రా ఇలా చాలా మందే ఉన్నారు. 
ఇలా రుష‌బ్ పంత్ , ఉర్వ‌శీలు కూడా ప్రేమ‌లో ఉంటే.. వారి బంధాన్ని ఎక్క‌డి వ‌ర‌కూ తీసుకెళ్తారో వేచి చూడాలి.  

ఇదిలా ఉంటే.. ఊర్వశి మిస్ చాలా బిజీబిజీగా ఉంది. ఆమె యూనివర్స్ పేజెంట్ 2021కి చివరిసారిగా న్యాయనిర్ణేతగా కనిపించింది. అరబ్ సూపర్ స్టార్ మొహమ్మద్ రంజాన్‌తో కలిసి ఆమె అంతర్జాతీయ పాట 'వెర్సేస్ బేబీ న‌టించి  ప్రశంసలు అందుకుంది. ఊర్వశి త్వరలో జియో స్టూడియోస్ నిర్మిస్తున్న‌ వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సరసన ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలాగే.. ‘తిరుట్టు పాయలే 2’ హిందీ రీమేక్‌తో పాటు ద్విభాషా థ్రిల్లర్ ‘బ్లాక్ రోజ్’లో  ప్రధాన పాత్రను పోషించబోతోంది. శరవణ సరసన 'ది లెజెండ్'తో తమిళంలోకి అడుగుపెట్టిన ఊర్వశి జియో స్టూడియోస్,  టి-సిరీస్‌తో మూడు చిత్రాల ఒప్పందంపై సంతకం చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios