మహేష్ సర్కారు వారి పాట మూవీపై భారీ అంచనాలుండగా రోజుకో వార్త పుట్టుకొస్తుంది. కొద్దిరోజుల క్రితం ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ గట్టిగా ప్రచారం అయ్యింది. అలాగే ఈ చిత్రంలో విలన్ అంటూ అరవింద స్వామి, ఉపేంద్ర మరియు సుదీప్ వంటి నటుల పేర్లు వినిపించాయి. తాజాగా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సిస్టర్ రోల్ పై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 

సర్కారు వారి పాట మూవీలో మహేష్ కు ఓ సిస్టర్ రోల్ ఉంటుందట. కథలో కీలమైన ఆ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ని అనుకుంటున్నారట. నటనకు స్కోప్ ఉన్న ఆ పాత్రను విద్యాబాలన్ చేత చేయించాలని దర్శకనిర్మాతల ఆలోచన అని, ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలుపెట్టారని సదరు కథనాల సారాంశం. మరి ఈ విషయంపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ లో  చక్కర్లు కొడుతుంది. 

ఇక సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ అమెరికాలో మొదలుకానుందట. మేకర్స్ సెప్టెంబర్ లోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టాలని ఆలోచన చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుందని టాక్. ఇక ఈ చిత్రంలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన మహేష్ ప్రీ లుక్ కి విశేష స్పందన దక్కింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.