Asianet News TeluguAsianet News Telugu

Bimbisara:‘బింబిసార’డైరక్టర్ నెక్ట్స్ ఆ స్టార్ తో ...నిజమేనా?

  బింబిసార చిత్ర టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ అభిమానుల దగ్గర నుంచి ప్రముఖులు దాకా.. ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని, కళ్యాణ్ రామ్‌, దర్శకుడు వశిష్ట్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ బాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్‌గా ఈ సినిమా చూసిన బన్నీ, సినిమా హిట్ అయినందుకు యూనిట్‌ని అభినందనలు తెలిపాడు. 

Bimbisara director on board for Balayya film with Geetha Arts?
Author
Hyderabad, First Published Aug 8, 2022, 4:58 PM IST

సినీ పరిశ్రమలో ఓ శుక్రవారం జీవితాలు మారిపోయాయి. లైఫ్ లు డిసైడ్ అయ్యిపోతాయని చెప్తూంటారు. నమ్ముతూంటారు. అది నిజం కూడా. సినిమాలకు జనమే రావటం లేదని నిరాశలో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.   ఈనెల 5వ తేదీన విడుదలైన ‘బింబిసార’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. కళ్యాణ్ రామ్, కొత్త దర్శకుడు వశిష్ట్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు కొల్లగొడుతూ, టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఊపిరి పోసింది. దాంతో అందరి దృష్టీ ఈ కొత్త దర్శకుడుపై పడింది. ఈ దర్శకుడు నెక్ట్స్ ఏ హీరోతో చెయ్యబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం దర్శకుడు వశిష్ట్ తో ముగ్గురు యంగ్ హీరోలు టచ్ లో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే విశిష్ట్ మాత్రం ఈ సారి మరో వైవిధ్యమైన నేపధ్యంతో రూపొందే యాక్షన్ చిత్రం ప్లాన్ చేస్తున్నారని, దాన్ని మోయగలిగే హీరో కావాలని కోరుకుంటున్నారట. సాయి ధరమ్ తేజ తో ప్లాన్ చేస్తున్నాడని వినపడుతోంది. అయితే మీడియాతో మాత్రం బాలయ్యతో సినిమా ఉండే అవకాసం ఉందని ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారంటున్నారు.  అయితే కల్యాణ్ రామ్ తో బింబిసార 2 వెంటనే చేస్తాడా ..గ్యాప్ ఉంటుందా అనే విషయమై ఈ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. 

మరో ప్రక్క  బింబిసార చిత్ర టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ అభిమానుల దగ్గర నుంచి ప్రముఖులు దాకా.. ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని, కళ్యాణ్ రామ్‌, దర్శకుడు వశిష్ట్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ బాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్‌గా ఈ సినిమా చూసిన బన్నీ, సినిమా హిట్ అయినందుకు యూనిట్‌ని అభినందనలు తెలిపాడు. కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సాహిస్తోన్న కళ్యాణ్‌ని తానెంతో గౌరవిస్తానని పేర్కొన్నాడు.

‘‘బింబిసార చిత్రబృందానికి శుభాభినందనలు. ఇదొక ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫ్యాంటసీ సినిమా. కళ్యాణ్ రామ్ నటన ప్రభావితం చేసేలా ఉంది. ఎల్లప్పుడూ కొత్త తరహా కథల్ని అటెంప్ట్ చేయడంతో పాటు కొత్త ట్యాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోన్న కళ్యాణ్ రామ్ అంటే నాకెంతో గౌరవం. తొలి ప్రయత్నంలో ఇంత గొప్ప చిత్రాన్ని హ్యాండిల్ చేసిన దర్శకుడు వశిష్ట్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శభాభినందనలు. బింబిసార.. అన్ని వయసుల వారు చూసి, ఎంజాయ్ చేయగలిగే సినిమా’’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. 
 
కాగా.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ‘బింబిసార’ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా నటించారు. రాజ్యాధికార కాంక్షతో ఎంతోమందిని బలితీసుకున్న రాజు.. టైమ్ ట్రావెల్ చేసి, ప్రస్తుత లోకంలో వచ్చి, తాను చేసిన తప్పుల్ని తెలుసుకొని, వాటిని సరిదిద్దుకునే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సంయుక్తా మీనన్, కేథరీన్ తెరిసాలు హీరోయిన్లుగా నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios