Radhe Shyam:లాస్ట్ మినిట్ ట్విస్ట్...రెండు తెలుగు రాష్టాల్లో 'రాధేశ్యామ్' కు షాక్

ఇప్పుడు అన్నీ హంగులు పూర్తి చేసుకుని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రటీమ్.  అయితే ఇదే సమయంలో ఈ చిత్రం థియోటర్స్ పరంగా పెద్ద షాక్ తగిలింది. 

Big Shock For Radhe Shyam In telugu States


ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పాన్‌ ఇండియా చిత్రం రాధేశ్యామ్.  గత కొంతకాలంగా  ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రాన్ని  గోపీచంద్‌ తో జిల్‌ వంటి స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగానే విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ హంగులు పూర్తి చేసుకుని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రటీమ్.  అయితే ఇదే సమయంలో ఈ చిత్రం థియోటర్స్ పరంగా పెద్ద షాక్ తగిలింది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు....ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్దాయిలో రిలీజ్ కావటం లేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా విడుదల చేస్తున్నారు.  అయితే ఇది ఇప్పుడు సొంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో  థియోటర్స్ సంఖ్య తక్కువ కావటం పెద్ద షాక్‌ అనే చెప్పాలి.  రాధే శ్యామ్ సినిమాని ఏపీ, తెలంగాణల్లో అతి తక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని జంట తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 860 థియేటర్లలో విడుదల చేయనున్నారు. రేపు సినిమా విడుదలకు సిద్ధమవుతున్నందున ఈ రోజు సంఖ్య స్వల్పంగా పెరగవచ్చు. 

  భీమ్లా నాయక్ (సుమారు 1075), మరియు పుష్ప (సుమారు 1150)  స్క్రీన్‌లలో విడుదల చేసారు. అలాగే సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ తెలుగు రాష్ట్రాల్లో 925 స్క్రీన్‌లతో విస్తృతంగా విడుదలైంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమా అంటే ఏ రేంజిలో రిలీజ్ అవ్వాలి. అయితే ఊహించని విధంగా థియోటర్స్ అతి తక్కువ రావటం పెద్ద షాకే. 

అందుకు కారణం  సూర్య యొక్క ET చిత్రం ఈ రోజు విడుదలైంది. కానీ అది రాధే శ్యామ్‌కి డైరక్ట్ పోటీ కాదు. కొన్ని వారాల క్రితం విడుదలైన భీమ్లా నాయక్ కూడా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇవేమీ  రాధే శ్యామ్‌కి థియేటర్ కౌంట్ తక్కువగా ఉండటానికి సరైన కారణంగా కనిపించడం లేదు. థియేటర్ల కౌంట్ విషయంలో ఏం జరుగుతుందో అర్దంకావటం లేదు అని ప్రభాస్ అభిమానులు ఇప్పుడు రాధే శ్యామ్ మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios