#NBK107: ‘వీర సింహారెడ్డి’ ఓవర్ సీస్ రైట్స్ షాకింగ్ డీల్.. ఎందుకలా చేసారు?
ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ (#VeeraSimhaReddy) అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైంది. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా టైటిల్ లాంచ్‌కు వేడుక నిర్వహించారు. అభిమానుల సమక్షంలో పేరును ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ తో మొదటి సారిగా యంగ్ డైరక్టర్ గోపీచంద్ మలినేని వర్క్ చేస్తూ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ మూవీలో బాలయ్య పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ఆయన కెరీర్ 107వ మూవీగా ఇది తెరకెక్కుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ (#VeeraSimhaReddy) అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైంది. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా టైటిల్ లాంచ్‌కు వేడుక నిర్వహించారు. అభిమానుల సమక్షంలో పేరును ప్రకటించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆడియన్స్ లో మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగుతోంది.
తాజాగా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని మూడు కోట్లకు అమ్మినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రానికి ఇంత తక్కువ రేటు పలకటం ట్రేడ్ ని షాక్ చేస్తోంది. మరో ప్రక్క చిరంజవీ వాల్తేరు వీరయ్య #MEGA154 చిత్రాన్ని 9.5 కోట్లకు ఓవర్ సీస్ రైట్స్ పలకినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తొలి నుంచి బాలయ్య సినిమాలకు ఓవర్ సీస్ లో పెద్దగా బిజినెస్ జరగటం లేదు. సినిమా రిలీజ్ అయ్యి హిట్టయ్యాక కలెక్షన్స్ చూసి అక్కడ తక్కువ రేటుకు తీసుకున్నవాళ్లు లాభాలు చూస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాకు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఇంత తక్కువ రేటుకు తీసుకుని ఉంటే బాగా లాభాలు చూడటం ఖాయం.
‘క్రాక్’ విజయం అనంతరం దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఆయన ఈ సినిమాలో బాలకృష్ణను ఎంత మాస్‌గా చూపించబోతున్నారో ఇప్పటికే విడుదలైన టీజర్ తెలియజేసింది. ఇందులో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్ సందడి చేయనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, బాలయ్య అభిమానిగా సమరసింహా రెడ్డి మూవీ ఫస్ట్ డే చూసి జైల్లో ఒకరోజు గడిపిన ఆయన వీరాభిమానిగా ఈ సినిమాని ప్రాణం పెట్టి తెరకెక్కించాను. ఈ మూవీలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి కావలసిన అన్ని అంశాలతో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునే మంచి కంటెంట్ కూడా ఉంది. మీరు అనుకున్న దానికంటే వీర సింహా రెడ్డి మూవీ రెండింతలు పెద్ద సక్సెస్ అవుతుంది అన్నారు.
ఇప్పటికే మూవీ దాదాపుగా పూర్తి కావచ్చిందని, కేవలం మరొక ఇరవై రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, అయినప్పటికీ ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా వీర సింహా రెడ్డి సూపర్ హిట్ కొడుతుందని, ఆ విధంగా ఇందులో కావలసినంత స్టఫ్ ఉందని అన్నారు గోపీచంద్. వీరసింహా రెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్ అంటూ సాగె ఇటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ మూవీలో ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు మూవీకి ఎంతో గొప్పగా డైలాగ్స్ రాసారని అన్నారు. సంక్రాంతికి రానున్న వీర సింహా రెడ్డి తప్పకుండా అందరి అంచనాలు అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడం ఖాయం అనే ఆశాభావము ఆయన వ్యక్తం చేసారు.