#Balakrishna: బాలయ్య డెసిషన్ ..నిజమైతే అల్లు అరవింద్ కు షాకే

 ఓ ప్రక్కన గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రానికి అనీల్ రావిపూడిని ఎంచుకున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఇద్దరి డైరక్టర్స్ కథలు విని ఒకరికి ఓటేసారని సమాచారం. ఆ డైరక్టర్స్ ఎవరూ అంటే... పరుశురామ్, వెంకటేష్ మహా.  

Balakrishna is interested to work with Korrapati Sai instead of Allu Aravind?

నటుడుగానే కాదు బాలయ్య నిర్ణయాలు తీసుకోవటంలోనూ చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఆయన ఎప్పటికప్పుడు తన డెసిషన్స్ తో ఫ్యాన్స్ ని సర్పైజ్ చేస్తూంటారు. ఊహించని కాంబోలను సెట్ చేసుకుంటారు. ముఖ్యంగా యంగ్ డైరక్టర్స్ తో బాలయ్య ప్రయాణం చాలా స్పీడుగా సాగుతోంది. ఓ ప్రక్కన గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రానికి అనీల్ రావిపూడిని ఎంచుకున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఇద్దరి డైరక్టర్స్ కథలు విని ఒకరికి ఓటేసారని సమాచారం. ఆ డైరక్టర్స్ ఎవరూ అంటే... పరుశురామ్, వెంకటేష్ మహా.  

డీసెంట్ హిట్ గా నిలిచిన 'కేర్ ఆఫ్ కంచెరపాలెం' సినిమాతో  పరిచయం అయ్యారు డైరెక్టర్ మహా వెంకటేష్. ఈ చిత్రం విడుదల కాకముందు ఈ దర్శకుడు గురించి, సినిమా ఎవరికీ తెలియదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో క్యారక్టర్స్,సీన్స్   మన జీవితాలకు దగ్గరగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. కమర్షియల్ గానూ ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమాతో వెంకటేష్ కు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహా వెంకటేష్ మాట్లాడారు.. ఎప్పటినుంచో బాలకృష్ణ తో సినిమా తీయాలని ఉందని అన్నారు. అయితే తన కథలు బాలకృష్ణ కు సూట్ అవుతాయో లేదో తెలీదు కానీ ఎప్పటికైనా ఆయనతో ఓ సినిమా తీస్తానని వ్యాఖ్యానించారు. వెంటనే బాలయ్య అనుమతితో ఆ డైరక్టర్ ఓ స్టోరీ లైన్ వినిపించారట. 

మరో ప్రక్క అదే ఈవెంట్ ల్ డైరెక్టర్ పరశురామ్ కూడా బాలకృష్ణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంచి కథతో బాలకృష్ణ ముందుకు రాబోతున్నాం అని అన్నారు. అంటే త్వరలోనే పరశురాం, బాలకృష్ణ కాంబో లో సినిమా రాబోతోందని అందరికీ అర్దమైంది. పరుశురామ్.. గీతా ఆర్ట్స్ లో  అల్లు శిరీష్ తో 'శ్రీరస్తు శుభమస్తూ' సినిమా తీశారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో  'గీతా గోవిందం' లాంటి సినిమా చేసారు.  అది 'సర్కారు వారి పాట' లాంటి సినిమాకు అవకాశం వచ్చేలా చేసింది. దాంతో మరోసారి గీతా ఆర్ట్స్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాం అని హింట్ ఇచ్చారు డైరెక్టర్ పరశురామ్. పరుశురామ్ చెప్పిన స్టోరీ లైన్ విన్నారట బాలయ్య.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాని ప్రకారం..ఈ రెండు కథల్లో వెంకటేష్ మహా చెప్పిన కథ..బాలయ్యకు బాగా పట్టేసిందని వినికిడి. అందులో హ్యూమన్ డ్రామా, రియలిస్టిక్ ఫెరఫార్మెన్స్ చోటుండటంతో రెగ్యులర్ మసాలా ఫిల్మ్ కాదని, తనకో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని బాలయ్య భావించారట. దాంతో తనతో గతంలో లెజండ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన వారాహి బ్యానర్ పై సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే పూర్తి స్క్రిప్టు నేరేషన్ వినబోతున్నారని తెలిసింది. ఇక పరుశురామ్ తో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక చేద్దామని, ఈ లోగా స్క్రిప్టు పూర్తి చెయ్యమని చెప్పినట్లు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios