Anupama Parameswaran:లిప్ లాక్ కోసం ఆ మాత్రం సమర్పించాల్సిందే

 ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్ గా మారింది . ట్రైలర్‌లోనే లిప్ లాక్ తో ప్రమోట్ చేసారు నిర్మాతలు.

 

Anupama Charged Career Highest Paycheck?

అవును...ఓ కొత్త హీరోకు లిప్ లాక్ పెట్టాలంటే ఒప్పుకుంటుందా...అంటే ఖచ్చితంగా ఆలోచనలో పడుతుంది స్టార్ హీరోయిన్. అందులోనూ కెరీర్ లో ఇంతకాలం అలాంటి వాటికి దూరంగా ఉంటూ వచ్చిన అనుపమా పరమేశ్వరన్ లాంటి హీరోయిన్ అయితే మరీను. కానీ దిల్ రాజు లాంటి నిర్మాత పట్టుబడితే.. సినిమాలో ఆ సీన్ కు వచ్చే  రెస్పాన్స్ ఓ రేంజిలో ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తే ..ఎంత అడిగితే అంత ఇవ్వాలి. అదే జరిగిందిట.
 
ఇండస్ట్రీలో వినపడుతున్న దాని ప్రకారం ఈ ప్రాజెక్టు అనుపమా దగ్గరకు వెళ్లగానే కొత్త హీరో కాబట్టి రెమ్యునేషన్ ఎక్కువ కావాలి అని చెప్పిందిట. ఆ తర్వాత లిప్ లాక్ మాత్రం ఒప్పుకోలేదట. కానీ డైరక్టర్ ఆమె అయితే బాగుంటుందని పట్టుబట్టడంతో ఆమెకు లిప్ లాక్ కు సైతం రెమ్యునేషన్ కలిపి ఐదు కోట్లు దాకా పే చేసారని సమాచారం. అయితే సినిమాకు నెగిటివ్ టాక్ రావటంతో ఇప్పుడు లెక్కలేసుకుంటున్నారట.
 
 అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యింది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనుప‌మా.. ఎప్పటికప్పుడు  త‌న ఫోటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకొంది.సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనుప‌మ త‌న‌దైన స్టైల్ ఫాన్స్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.  

ఇక  ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అయ్యాడు. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కించాడు. ఇందులో అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ సినిమా కోసం లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది అనుపమ. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్ గా మారింది . ట్రైలర్‌లోనే లిప్ లాక్ తో ప్రమోట్ చేసారు నిర్మాతలు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్‌’ ప‌క్కా యూత్ కంటెంట్ మూవీ.   కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో ల‌వ్ కంటెంట్ ఎలా ఉంటుంద‌నేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావ‌డంతో దీనికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష మంచి టీమ్‌తో యూత్ సహా అందరకీ నచ్చే ఓ ఎంటర్‌టైనింగ్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుందనడంలో సందేహం లేదు. దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాలో పాటలకు వచ్చిన రెస్పాన్సే అందుకు ఎగ్జాంపుల్.  అనుప‌మ మా బ్యాన‌ర్లో చేసిన మూడో సినిమా. త‌ను కొత్త అమ్మాయిలా ఒదిగిపోయి యాక్ట్ చేసింది. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో రౌడీ బాయ్స్ యూత్‌ని మెప్పిస్తుంది’’ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios