Pushpa-2: అల్లు అర్జున్ కి రెమ్యునరేషన్ క్రింద ఏమి రాస్తున్నారో తెలుసా?
పుష్ప సినిమా భారీ విజయాన్ని మాత్రమే కాదు రికార్డు కలెక్షన్స్ ను కూడా సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా ఊర మాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ కనబరిచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
‘పుష్ప’(Pushpa) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్(Allu arjun). ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ‘పుష్ప2’ చేస్తున్నారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించిన పనులను చిత్ర టీమ్ వేగవంతం చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కు అల్లు అర్జున్ ఎంత రెమ్యునరేషన్ అందుకోబోతున్నరనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ క్రింద హిందీ రైట్స్ డిమాండ్ చేస్తున్నారట. హిందీలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఈ చిత్రం బిజినెస్ హ్యాండిల్ చేస్తారు. అలా జరిగితే అల్లు అర్జున్ కు రెగ్యులర్ గా వచ్చే పే చెక్ కన్నా చాలా ఎక్కువ ముడుతుంది అంటున్నారు.
అలాగే ఈ సినిమా నిమిత్తం అల్లు అర్జున్ నిర్మాతలకు ,దర్శకుడుకి పలు సూచనలు చేశారట. ముఖ్యంగా ‘పుష్ప: ది రైజ్’ షూట్ అనుకున్న దానికంటే ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీని వల్ల అనుకున్న స్థాయిలో ప్రచారం కూడా చేయలేకపోయారు. ప్రీరిలీజ్ వేడుకకు దర్శకుడు సుకుమార్ సైతం హాజరు కాలేకపోయారు. ఈ సారి మాత్రం ఆ తప్పును మళ్లీ చేయొద్దని బన్నీ సూచించారట. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి, ప్రచార కార్యక్రమాలకు ఎక్కువ సమయం ఉండేలా చూసుకోవాలని చిత్ర టీమ్ కి చెప్పారట. అందుకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్, ఇతర నటీనటుల డేట్స్‌ను లాక్ చేసే పనిలో ఉన్నారు.
పుష్ప పార్ట్ 1 భారీ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు పార్ట్ 2 పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ”పుష్ప: ది రూల్” చిత్రంలో హీరో పక్కన ఉండే కేశవాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే రెండో భాగంలో కేశవా పుష్పకు వెన్ను పోతూ పొడుస్తాడని దాంతో హీరో కొత్త చిక్కుల్లో పడతాడని టాక్ నడుస్తుంది. అదే సమయంలో .మొదటి పార్ట్ లో విలన్స్ గా చూపించిన , మంగళం శీను.. అతని భార్య దాక్షాయణి పుష్ప పై ప్రతీకారం తీర్చుకుంటారని.. వీళ్లతోపాటు షికవాత్ గా నటించిన ఫజిద్ ఫాహల్ అల్లు అర్జున్ పై పగ తీర్చుకుంటాడని వినిపిస్తున్నాయి.