#Pushpa2: సుకుమార్ సూపర్ స్కెచ్, బన్నీకే సౌండ్ లేదు
లెక్కల మాస్టారు సుకుమార్ లెక్కలు ఇన్నాళ్లగా ఆయనతో పనిచేస్తున్న అల్లు అర్జున్ కు తెలియనివి కాదు. కానీ ఎప్పటికప్పుడు సుకుమార్ తన ఆలోచనలో ఆశ్చర్యపరుస్తూంటాడు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ కు సుకుమార్ తెలివి,ఆలోచనలపై ముచ్చటేసింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2‘. ఈ సినిమా కోసం సుకుమార్ కథ పై చాలా రోజులు కసరత్తు చేసి,ఫెరఫెక్ట్ స్క్రిప్టు రెడీ చేసారు...పూజా కార్యక్రమాలతో పుష్ప 2 స్టార్ట్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసారు. ‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్ ఇంకా టీమ్‌లో చేరలేదు. అయితే ప్రస్తుతం ఇతర నటీనటులు, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఈ చిత్రం ప్రమోషన్ కు ప్రత్యేకమైన ప్లాన్ చేసారట.
డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న ‘అవతార్ 2’ తో పాటుగా పుష్ప 2 స్పెషల్ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారట. జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన మరో అద్భుత సృష్టి అవతార్ 2. ఆ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఓ రేంజిలో ఓపినింగ్స్ ఉంటాయి. దాంతో ఆ సినిమాతో పాటు టీజర్స్, ట్రైలర్స్ రిలీజ్ చేయటానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. కానీ ఎన్ని వచ్చినా పుష్ప 2 టీజర్ అంటే ఆ సెన్సేషన్ వేరు. కాబట్టి ఆ రోజు స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తే… కావాల్సినంత పబ్లిసిటీ వస్తుందని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.ఈ సూపర్ ఐడియాకు అల్లు అర్జున్ చాలా ఆనందపడ్డారరట.
అంటే ఓ రకంగా పాన్ ఇండియా టీజర్ రిలీజ్ చేయబోతున్నారన్నమాట. అనుకున్నది అనుకున్నట్లు జరిగిందే అవతార్ 2 ఆడే ప్రతి చోట పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. పుష్ప 2 స్పెషల్ టీజర్ ని మొత్తం 25 భాషల్లో రెడీ చేస్తున్నారట. అవతార్ 2 తో పుష్ప 2 టీజర్ అంటే నిజంగానే సినిమాకి నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ అంటున్నారు. సుక్కు టీజర్ రిలీజ్ తో నే చరిత్ర సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ కోసం రామోజి ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే పుష్ప సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అయిపోతుంది. దీంతో పుష్ప 2 కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ముహూర్తపు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం లేటుగా మొదైలంది. సుకుమార్ ఈ రెండో పార్ట్‌ను మరింత హిట్ చేయాలని చెక్కుతూనే ఉండటమే కారణమని తెలిసింది. పుష్ప ఫస్ట్ పార్ట్ అనుకున్నదానికంటే ఎక్కువ హిట్ అవ్వడం, నార్త్‌లో విపరీతంగా డిమాండ్ రావడంతో ఈ సినిమాను మరో స్థాయిలో తెరకెక్కించాలని భావించి భారీగా ప్లాన్ చేసారు.
ఈ క్రమంలో ఎట్టకేలకు పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.అందు కోసం ఒక ప్రత్యేక సెట్ ఏర్పాటైంది. సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఇందులో చిత్రీకరించనున్నారు. అల్లు అర్జున్ ఈ సన్నివేశాల్లో లేకపోవడంతో..అతడు హాజరు కాలేదు. డిసెంబర్ నుంచి బన్నీ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ప్రభాస్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన బాహుబలి సెట్స్ వేసిన చోటే ఈ షూట్ జరుగుతోందని వినికిడి.