Asianet News TeluguAsianet News Telugu

రీమేక్ కు డైరక్టర్ ని ఫైనలైజ్ చేసిన అరవింద్

రీసెంట్ గా గీతా ఆర్ట్స్ వారు మలయాళంలో వచ్చిన ‘నాయాట్టు’ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు తమిళ,కన్నడ, తెలుగులో రీమేక్ అవ్వబోతోంది.  

Allu Aravind final Nayattu Telugu remake director?
Author
Hyderabad, First Published Aug 11, 2021, 11:25 AM IST

కుంచాకో బోబన్ - జోజు జార్జ్ - నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'నాయట్టు' (తెలుగులో 'వేట') చిత్రానికి మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతోంది. అయితే డైరక్టర్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది.

వివరాల్లోకి వెళితే..రీసెంట్ గా గీతా ఆర్ట్స్ వారు మలయాళంలో వచ్చిన ‘నాయాట్టు’ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు తమిళ,కన్నడ, తెలుగులో రీమేక్ అవ్వబోతోంది.  తమిళ వెర్షన్ ని గౌతమ్ మీనన్ డైరక్ట్ చేయబోతున్నారు. తెలుగులో కూడా ఆయనే చేస్తారని అనుకున్నారు. అయితే ఆయన ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో తెలుగు నేటివిటి కలిపి చేయటానికి ఇక్కడ ఓ యంగ్ డైరక్టర్ ని ఫైనలైజ్ చేసినట్లు వినికిడి. 

లిమిటెడ్ బడ్జెట్ లో  ఒక నెలలో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసేలా ఎగ్రిమెంట్ చేయబోతున్నారట. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే పలాస చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన కరుణకుమార్ అని తెలుస్తోంది. ఆయన అల్లు అరవింద్ ..ఆహాకు మెట్రో కథలనే వెబ్ సీరిస్ తో మన ముందుకు వచ్చారు. ఆయన ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ని చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం థియోటర్ లో మొదట వేసి ఆ తర్వాత కొద్ది రోజులకే ఆహాలో వస్తుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నటీనటుల సెలక్షన్ మొదలైపోయింది. మలయాళంలో నిమిషా సజయన్ పోషించిన కానిస్టేబుల్ పాత్రకు నేచురల్ బ్యూటీ తెలుగమ్మాయి అంజలి ని ఫైనలైజ్ చేసారట. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం రావు రమేష్ ని తీసుకున్నారని అనుకుంటున్నారు. కుంచాకో బోబన్ పాత్ర కోసం సత్యదేవ్ ని సంప్రదిస్తున్నారని టాక్.

మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాహి కబీర్ కథ అందించారు. రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారు.. అధికారం చేతిలో ఉంటే నాయకులు ఎవరినైనా ఎలా వేధింపులకు గురి చేస్తారు.. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ సొంత పోలీసులను ఎలా బలిపశువులను చేస్తుంది.. అనే అంశాలను ఈ చిత్రంలో చూపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios