#AllariNaresh:అల్లరి నరేష్ కే అన్యాయం, పెద్ద ప్రొడ్యూసర్స్ దే ఆ పాపం?
అల్లరి నరేష్ "ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం" అనే మూవీ తో మన ముందుకు వస్తున్నాడు. ఆనంది ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఏ ఆర్ మోహన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటుడిగా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయిన అల్లరి నరేష్ ఒకరు. తన కెరీర్ లో ఎక్కువగా కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. అయితే నరేష్ కి కేవలం కామెడీ నటుడు కన్నా మంచి నటుడు అనిపించుకోవాలని మొదటి నుంచి కోరిక. దాంతో కామెడీ సినిమాలు ప్రక్కన పెట్టి కథా ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లో నటించటం మొదలెట్టారు. అలాగే తను చేసే ప్రతీ కథా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే నాంది మూవీ లో కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు ఇప్పుడు తాజాగా అల్లరి నరేష్ "ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం" అనే మూవీ తో మన ముందుకు వస్తున్నాడు. ఆనంది ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఏ ఆర్ మోహన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రం నుండి ఇప్పటికే ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు థియేటర్స్ చాలా తక్కువ కేటాయిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం దిల్ రాజు ,అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న డబ్బింగ్ సినిమాలు ఈ వారం రిలీజ్ కావటమే.
దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న #LoveToday చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. అలాగే అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తోడేలు #Thodelu కు కూడా అత్యథిక థియేటర్స్ లభించాయి. కానీ స్ట్రైయిట్ చిత్రంమైన అల్లరి నరేష్ "ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం"కు మాత్రం ఆ స్దాయిలో థియేటర్స్ దొరకలేదని తెలుస్తోంది. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయమై భారీగా చర్చ జరుగుతోంది. డబ్బింగ్ సినిమాలకు ఇచ్చిన ప్రయారిటీ స్ట్రైయిట్ సినిమాకు ఇవ్వకపోవటమేమిటని అంటున్నారు. అయితే డైరక్ట్ గా ఎవరూ అనటం లేదు కానీ ఫిల్మ్ సర్కిర్స్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మరొక చిత్రం ఉగ్రమ్. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని విజయ్ కనక మేడల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నాంది సినిమా తర్వాత మళ్లీ ఈ హీరో డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో అంచనాల పెరిగిపోయాయి. మరి ఈ సినిమాలతో అల్లరి నరేష్ తన సక్సెస్ను కొనసాగిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.