Thank You: అక్కినేని అభిమానుల్లో ఆందోళన.. ఏం జరుగుతుందో..
గత ఏడాది లవ్‌స్టోరీతో హిట్ కొట్టిన చైతూ.. ఈ ఏడాది కూడా అదే హవాను కొనసాగిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజుతో ఈ ఏడాది మరో హిట్‌ను అందుకుని దూకుడు చూపించాడు. వరుస సక్సెస్‌లతో తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు ధాంక్యూ సినిమాతో మన ముందుకు వస్తున్నారు.
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా దిల్‌రాజు(Dil Raju) ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌లో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’(Thank You). రాశీఖన్నా(Raashi Khanna), మాళవికా నాయర్ హీరోయిన్స్. విక్రమ్ కె.కుమార్ (Vikram k kumar)దర్శకత్వం వహించారు. ఈ నెల 22న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించాడు. జీవితంలో మన ఎదుగుదలకు తోడ్పడిన వాళ్లు ఎవరైనా సరే వాళ్లని అస్సలు మర్చిపోకూడదు.. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలనేది ఈ సినిమా కాన్సెప్ట్. వినడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్న ఈ కాన్సెప్ట్ ను సినిమాగా ఎలా మలిచారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అదే సమయంలో గత కొంత కాలంగా ఏ సినిమాకూ సరైన ఓపినింగ్స్ రాకపోవటం భయానికి గురి చేస్తోంది.
స్టోరీ లైన్ గా రిఫ్రెష్ గా అనిపిస్తున్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేవని ఇప్పటికే వదిలిన ప్రమోషన్ మెటీరియల్ ని బట్టి అర్దమవుతోంది. ఇదో ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తోంది. ట్రైలర్ బజ్ క్రియేట్ చేయటంలో ఫెయిలైంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు పాటలు కీలక పాత్ర వహిస్తాయి. కానీ ఆడియో కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. నాని నటించిన `అంటే సుందరానికి` కూడా భాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవటం జరిగింది. ఇవన్నీ ట్రేడ్ లో చర్చగా మారాయి.
నాగచైతన్య ఈ సంవత్సరం మొదట్లో `బంగార్రాజు`తో హిట్ కొట్టారు. ఇప్పుడు ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది అభిమానుల్లో డిస్కషన్ గా మారింది. `ప్రేమమ్` సినిమాలో మూడు వయసులకు సంబంధించిన ప్రేమకథలు ఉంటాయి. ఇప్పుడు `థాంక్యూ`లో కూడా చైతన్యకు స్కూల్ ఏజ్ లో ఒక లవ్ స్టోరీ, కాలేజ్ మరో ప్రేమ కథ, ఆ తర్వాత ఇంకో ప్రేమ కథ ఉంటాయి. ముందు సెల్ఫిష్ గా ఉన్న హీరో.. ఆ తర్వాత ఎలా మారాడు.. అందరికీ థాంక్యూ ఎలా చెప్పాడు అనేది జూలై 22న తెరమీద చూడాలి. చైతూ మాత్రం ఈ సినిమాపై బాగా నమ్మకంగా ఉన్నాడు.
అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ... ‘‘ ‘మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే చేరిన గమ్యానికి విలువ ఉండదని’ ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ గురించి ఆలోచించినప్పుడు నాకు వైజాగ్ గుర్తుకొస్తుంది. నా సక్సెస్ స్టోరికి పెద్ద రీజన్ వైజాగ్. ఇక్కడ షూటింగ్ చేసిన ప్రతీ సినిమా నాకు కమర్షియల్ సక్సెస్ ఇవ్వటంతోపాటు హీరోగా మరో మెట్టు ఎక్కించింది.
‘థాంక్యూ’ అనే పదాన్ని మనం రోజు వాడుతుంటాం. కానీ అవసరం ఉన్న చోట వాడం. థాంక్యూ పదానికి అసలు అర్థాన్ని `థాంక్యూ` సినిమా నేర్పించింది. థాంక్యూ చెప్పటానికి సిగ్గు పడకూడదు. ‘మనం’లాంటి సినిమాను ‘థాంక్యూ’ రూపంలో ఇవ్వబోతున్నాడు దర్శకుడు విక్రమ్. పీసీ శ్రీరామ్‌గారితో పని చేయడం అనేది నా డ్రీమ్. ఈ సినిమాతో అది నేరవేరింది` శనివారం సాయంత్రం వైజాగ్‌లో జరిగిన `థ్యాంక్యూ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య తెలిపారు.