అఖిల్ కు సర్జరీ...వార్తల్లో నిజమెంత ?
అఖిల్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి ...
స్టార్స్ మీద సర్జరీ వార్తలు రావటం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే అఖిల్ లాంటి యంగ్ హీరో మీద వార్త అనగానే ఏమిటా సర్జరీ అనిపిస్తుంది. నిన్నటి నుంచి మీడియా లో అఖిల్ కు సర్జరీ అనే వార్తలు గుప్పుమంటున్నారు. అసలే అఖిల్ టైమ్ ఏమీ సరిగ్గా నడవటం లేదు. ఏ సినిమా చేసినా రెండో రోజుకే థియేటర్ ల నుంచి అవుట్ లా నడుస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి వార్త అంటే ఇబ్బంది కరమే. ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు అఖిల్ అక్కినేని. ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్ట పడ్డాడు. అయితే అదంత బూడిదలో పోసిన పన్నీరులా అయింది. ఈ మూవీతో నిర్మాత కూడా బాగా నష్టపోయాడు. ఫ్యాన్స్ బాధపడ్డారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కు బ్యాడ్ నేమ్ వచ్చింది.
మొన్నటి వరకు ఏజెంట్ రిజల్ట్ తో బాధ పడిన అఖిల్ ఇప్పుడిప్పుడే ఆ బాధనుంచి బయిటకు వస్తున్నారు. అఖిల్ తన తర్వాతి సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు. భారీ బడ్జెట్లో రూపొందే ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. సాహోకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్, అఖిల్ సినిమాతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాడని వార్త.
అయితే ఈ లోగా అఖిల్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని అంటున్నారు. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో చాలా మంది ముందు స్క్రిప్టుకు మెరుగులు దిద్దుకుని హిట్ కొట్టక, ఈ ముక్కుకు,మొహాన్ని చెక్కటం ఎందుకు అంటన్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ నిజానికి అఖిల్ అందగాడే..కాబట్టి కాస్మోటిక్ సర్జరీ వార్త ఫేక్ అంటున్నారు అభిమానులు. ఏదైనా తన తర్వాతి సినిమా విషయంలో అఖిల్ క్లారిటీ ఇవ్వడం బెటర్.