Akhil:విజయ్ దేవరకొండతో కాగానే అఖిల్ తో మొదలెట్టేస్తాడు,ఇది ఫిక్స్

 ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉన్నంతలో బాగానే ఆడింది. దాంతో  అఖిల్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు ఫిలింసర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

Akhil to debut with Karan Johar's film in Bollywood?


తెలుగు స్టార్స్ అంతా బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. తమ ప్యాన్ ఇండియా ఫిల్మ్ లతో అక్కడ మార్కెట్ గ్రాబ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ట్రెండ్ ని అక్కడ బాలీవుడ్ కూడా క్యాష్ చేసుకునే పనిలో ఉంది. తెలుగు నుంచి వచ్చే హీరోలకు తమదైన శైలిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటివారిలో కరణ్ జోహార్ ఒకరు. ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తవగానే మరో తెలుగు హీరో అఖిల్ తో చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

క‌ర‌ణ్ జోహార్ కు రాజమౌళి రూపొందించిన బాహుబ‌లిలో  వాటా ఉంది. అలాగే ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్ వెనుకా  ఆయనే ఉన్నాడు. `లైగ‌ర్‌`కి ఒకానొక నిర్మాత‌. త్వ‌ర‌లోనే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో సినిమా చేయ‌టానికి ఎగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు అఖిల్‌పై కూడా క‌ర‌ణ్ దృష్టిప‌డిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అఖిల్ తో క‌ర‌ణ్ జోహార్ ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో అఖిల్ హీరోగా ఓ ప్రాజెక్ట్ సెట్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. క‌ర‌ణ్ జోహార్ ద‌గ్గ‌ర చాలామంది ద‌ర్శ‌కుల టీమ్ ఉండటం కలిసొచ్చే అంశం.

ఇక తెలుగులో తెరంగేట్ర మూవీ 'అఖిల్'తో భారీ డిజాస్టర్ అందుకున్న అక్కినేని అఖిల్ తర్వాత 'హలో' సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు.   మూడో సినిమాని 'తొలిప్రేమ' హిట్ తో ఉన్న కుర్ర దర్శకుడు వెంకట్ అట్లూరితో కలిసి మొదలు పెట్టేశాడు. మిస్టర్ మజ్ను టైటిల్ తో వచ్చిన ఆ సినిమా కూడా ఆడలేదు. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉన్నంతలో బాగానే ఆడింది. దాంతో  అఖిల్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు ఫిలింసర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని.. అలాగే ఈ విషయంలో అఖిల్ తండ్రి నాగార్జున బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్టుగా టాక్.

నాగార్జున కూడా బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మాతగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలోనూ నాగార్జున అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కానీ ఈమధ్య కాలం అంటే ఓ పదేళ్లుగా నాగార్జున బాలీవుడ్ వైపు చూడనే లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్రలో నటిస్తున్నాడు.   ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాలో నటిస్తున్న నాగార్జునతో కరణ్ ఈ  డీల్ కూడా కుదుర్చుకున్నాడని అంటున్నారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios