Akhil:దిల్ రాజు నిర్మాతగా పవన్ డైరక్టర్ తో... ప్రాజెక్టు సెట్టైంది
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న `ఏజెంట్`పైనే ఆశలు పెట్టుకొన్నాడు అఖిల్. మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషించడం, భారీ బడ్జెట్ కేటాయించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్తున్నారు. అయితే నెక్ట్స్ ఏ ప్రాజెక్టు చేయాలి. ఎవరితో చేయాలి అనేది అఖిల్ ముందున్న ప్రశ్న.
తొలి చిత్రం నుంచి అఖిల్ కెరీర్ ఏ మాత్రం ఆశాజనకంగా సాగటం లేదు. వరసపెట్టి హలో, మిస్టర్ మజ్ను సినిమాల షెడ్ కు వెళ్లిపోయాయి. వరుసగా మూడు డిజాస్టర్లతో వచ్చిన క్రేజ్ అంతా పోగొట్టున్న నేపథ్యంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కాస్త ఓకే అనిపించింది. అయితే.. ఆ క్రెడిట్ కూడా పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న `ఏజెంట్`పైనే ఆశలు పెట్టుకొన్నాడు అఖిల్. మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషించడం, భారీ బడ్జెట్ కేటాయించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్తున్నారు. అయితే నెక్ట్స్ ఏ ప్రాజెక్టు చేయాలి. ఎవరితో చేయాలి అనేది అఖిల్ ముందున్న ప్రశ్న.
ఈ నేపధ్యంలో దిల్ రాజుని రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేలా నాగ్ ఒప్పించినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ వంటి నిర్మాత వెనక ఉండబట్టే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' నిలబడింది అని నాగ్ నమ్మి దిల్ రాజుని కలిసి ప్రాజెక్టు సెట్ చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఇప్పుడు అఖిల్ సోదరుడు చైతూతో ‘థ్యాంక్ యు’ సినిమా కూడా తీశాడు. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అఖిల్ ని డైరక్ట్ చేసే దర్శకుడు ఎవరు అంటే...
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తీసి సక్సెస్ అందుకున్నప్పటికీ.. వేణు శ్రీరామ్ నెక్ట్స్ ప్రాజెక్టు సెట్ కాలేదు. దాంతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ సినిమాను రాజు ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘వకీల్ సాబ్’ తర్వాత అల్లు అర్జున్‌తో ‘ఐకాన్’అనుకున్నప్పటికి అది వర్కవుట్ కాలేదు. ఆ కథతో వేరే స్టార్లను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని అఖిల్ కోసం కథ రెడీ చేశారు వేణు. ఇప్పుడు ఆ కథతోనే అఖిల్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కించబోతున్నట్లు సమాచారం.
మరో ప్రక్క `ఏజెంట్` షూటింగ్ రెగ్యులర్ గా జరగడం లేదు. ఈ సినిమాని ఆగస్టులో విడుదల చేద్దామనుకొన్నారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే ఆ తరవాత వాయిదా వేశారు. దసరాకి ఈ సినిమాని విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబరుకి మారే అవకాసం ఉందని సమాచారం.