Asianet News TeluguAsianet News Telugu

Akhanda:'అఖండ' కు ఆంధ్రాలో కొత్త సమస్య, చర్చల్లో నిర్మాత?

ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించగా నితిన్ మెహతా, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Akhanda Makers Discussion with Hotstar?
Author
Hyderabad, First Published Jan 3, 2022, 7:28 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ చిత్రం "అఖండ". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే ఈ సినిమా ఓటీటిలో స్ట్రీమ్ కాబోతోంది. అయితే రెండు రోజుల క్రితం దాకా ఆంధ్రాలో చాలా థియోటర్స్ క్లోజ్ చేసే ఉంచారు. ఇప్పుడు ఓపెన్ చేసారు.

 అఖండతో అక్కడ బిజినెస్ సాగుతోంది. సంక్రాంతి వచ్చేదాకా పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. దాంతో అఖండనే ఆడించాలనుకుంటున్నారు చాలా థియోటర్స్ వాళ్లు. కానీ ఓటీటిలో ఈ సినిమా వచ్చేస్తే ఖచ్చితంగా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. డిస్ట్రిబ్యూటర్స్  ఈ విషయాన్ని నిర్మాత దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో  ఇప్పుడు ఈ చిత్రం ఓటీటి రైట్స్ తీసుకున్న హాట్ స్టార్ వారికి, నిర్మాతకు మధ్య డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం.  

వాస్తవానికి ఈ సినిమాని రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటి రిలీజ్ కోసం Disney+ Hotstar తో ఎగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న సిట్యువేషన్ లో ఓటీటి రిలీజ్ ని మరికొన్ని వారాలకు వాయిదా వేయాలని నిర్మాత కోరుతున్నారు. కానీ అంత రేటు పెట్టి రైట్స్ తీసుకున్నాము..సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా ఓటీటిలో వెయ్యకపోతే మాకు కలిసి రాదని Disney+ Hotstar వారు తెగేసి చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం ఓటీటి రిలీజ్ తో ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.   "అఖండ" సినిమా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా. ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలని అభిమానులు థియేటర్లలో చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారన్నది నిజం. 

ఓటీటీలలో విడుదలయ్యాక కూడా ఈ సినిమాకి మంచి వ్యూస్ లభిస్తాయని ,అక్కడా సూపర్ హిట్ అవుతుందని హాట్ స్టార్ భావోస్తోంది. సినిమాలోని కనీసం కొన్ని సన్నివేశాలనైనా సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని అనుకుంటారని ఇక సినిమా అసలు చూడని వాళ్ళు కచ్చితంగా సినిమా చూస్తారని ఆ విధంగా ఈ సినిమాకి హాట్స్టార్ లో మంచివి వ్యూయర్షిప్ లభించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.
 Also Read : RRR-Radheshyam Postpone: సంక్రాంతికి పోటెత్తిన చిన్న చిత్రాలు.. `బంగార్రాజు`తోపాటు రాజ`శేఖర్‌`..
 బోయపాటికి 2016 లో అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ అనే హిట్ తర్వాత, 2017 లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘జయ జానకి నాయక’, 2019 లో రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ రెండూ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ తమ ఫ్లాపుల నేపథ్యాల నుంచి చేతులు కలిపి, ‘అఖండ’ తో అఖండ విజయాన్ని సాధించారు. కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ని కలెక్షన్లను నమోదు చేసుకొని ఈ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీకాంత్, నితిన్ మెహతా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు

Follow Us:
Download App:
  • android
  • ios