Acharya:బజ్ లేదు..కారణం అదేనా?..టెన్షన్ లో టీమ్
బాక్సాఫీస్ వద్ద RRR మరియు KGF 2 ఆరాచకం తర్వాత విడుదలైన మొదటి పెద్ద చిత్రం ఆచార్య. కన్నడిగులు సినిమాలు చూసి ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారనేది ఆసక్తికరం.
చిరంజీవి - చరణ్ హీరోలుగా కొరటాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆచార్య' .ఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది.నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ విడుదలైన పాటలు .. ఇతర అప్ డేట్లు అంచనాలు పెంచుతూ వెళ్లాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అనుకున్న స్దాయిలో బజ్ మాత్రం క్రియేట్ కావటం లేదు.
RRR విడుదల తర్వాత ఇది రామ్ చరణ్ నెక్ట్స్ చిత్రం, కానీ హైప్ ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతానికి, సినిమా పై ఎలాంటి హంగామా లేదు. బజ్ క్రియేట్ చేయడానికి టీమ్ త్వరగా ఏదైనా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓవర్సీస్‌లో, USA, AUS మరియు UKలలో బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. టిక్కెట్ అమ్మకాలు ప్రస్తుతానికి జస్ట్ ఓకే అన్నట్లు ఉన్నాయి. కొరటాల శివ లాంటి సక్సెస్‌ఫుల్ డైరక్టర్ నుంచి ఈ సినిమా వచ్చినప్పటికీ బజ్ ఆ స్దాయిలో లేదు.
బాక్సాఫీస్ వద్ద RRR మరియు KGF 2 ఆరాచకం తర్వాత విడుదలైన మొదటి పెద్ద చిత్రం ఆచార్య. కన్నడిగులు సినిమాలు చూసి ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారనేది ఆసక్తికరం. ఏదైమైనా ఇది ఆచార్య టీమ్ కు పెద్ద ఛాలెంజే. అయితే ప్రీ రిలీజ్ పంక్షన్ తర్వాత ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందని ట్రేడ్ ఎక్సపెక్ట్ చేస్తోంది. సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అవటం, లేటు అవటమే బజ్ క్రియేట్ కావటానికి కారణం అని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. కొంతసేపటి క్రితం అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.
చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో నక్సలైట్స్ గా కనిపించనున్నారు. దేవాలయ భూముల ఆక్రమణకు పాల్పడిన కొంతమంది అవినీతి పరుల ఆటకట్టించే దిశగా ఈ కథ నడుస్తుందని సమాచారం. చిరంజీవి సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. ఈ సినిమాకి రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది.