Salaar :'సలార్' స్క్రిప్టు....'ఛత్రపతి' ట్విస్ట్, 'బాహుబలి' ఫార్మెట్ !

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వాస్తవంగా ఈ సినిమా తర్వాత రిలీజ్ కావాల్సింది సలార్ మూవీనే. అయితే, ఇది రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. దాంతో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న సలార్ వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ అయింది.

About Prabhas Salaar movie script  and Stroy line


ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి, ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి’ సీరిస్‌లు ఎంతటి ఘన విజయం సాధించాయో తెలిసిందే. ఛత్రిపతి పెద్ద హిట్ అయితే, బాహుబలి ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటింది. ఛత్రపతికు ఇంట్రవెల్ ట్విస్ట్ ఓ రేంజిలో ఉంటే, బాహుబలి సినిమా విజయంలో సగ భాగం ఫస్ట్ పార్ట్ చివర్లో వచ్చే  కట్టప్పను ఎవరు చంపారనే ట్విస్ట్. ‘బాహుబలి: ద బిగెనింగ్’, ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ లను రెండు పార్ట్ లుగా విడితీసి హిట్ కొట్టడానికి ఈ ట్విస్ట్ ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు సలార్ కు కూడా అలాంటి ప్రయోగమే చెయ్యబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో ఛత్రపతి ఛాయిలు, బాహుబలి ఫార్మెట్ కనపడతాయని వినికిడి. వివరాల్లోకి వెళితే...

 పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్'. ఈ మూవీ బాహుబలి మాదిరిగా రెండు భాగాలుగా రానుందని తాజాగా ఓ వార్త వచ్చి కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియన్ స్థాయి దర్శకుడిగా పాపులరారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ దీనిలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య సలార్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వాస్తవంగా ఈ సినిమా తర్వాత రిలీజ్ కావాల్సింది సలార్ మూవీనే. అయితే, ఇది రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. దాంతో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న సలార్ వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ అయింది. 2023 సమ్మర్‌కు ఈ మూవీ వచ్చే అవకాశాఉన్నాయి. ఇక తాజాగా జరిగిన రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్స్‌లో సలార్ రెండు భాగాలుగా వస్తుందా అని ప్రభాస్‌ను ఓ విలేఖరి అడగుగా.. దానికి ఆయన, దీనిపై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇస్తారని సమాధానం చెప్పారు. దాంతో ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం మొదలైంది.

అలాగే ఈ రెండు పార్ట్ లను విడతీసే ట్విస్ట్ కూడా ఫైనల్ చేసారని చెప్పుకుంటున్నారు. బాహుబలి కట్టప్పను మించిన ట్విస్ట్ అదని చెప్తున్నారు.  ఉగ్రం అనే కన్నడ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కెజియఫ్ సినిమాతో తనేంటో చూపించాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈయన కోసం చూస్తున్నారు స్టార్ హీరోలు. కెజియఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సలార్ లాంటి మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు తెరతీసాడు ప్రశాంత్ నీల్.

సరిగ్గా గమనిస్తే... ఉగ్రం, కెజియఫ్ సినిమా కథలు వేరుగా ఉంటాయి కానీ మూలకథ మాత్రం ఒక్కటే.అదేమిటంటే.. అనామకుడిగా ఉన్న వాడు ఉన్నట్లుండి నాయకుడు కావడం. ఇప్పుడు సలార్ సినిమాలో కూడా ఇలాంటి కథనే చెప్పబోతున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం చెప్పాడు ఈ దర్శకుడు. తన సినిమాలో గ్రూపులో కుడిభుజంలా ఉండేవాడు.. లీడర్ ఎలా అయ్యాడు అనేది కథ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఎవ్వరూ చూపించని స్థాయిలో.. అంత పవర్ ఫుల్‌గా ఇందులో చూపించబోతున్నట్లు తెలిపాడు ప్రశాంత్ నీల్. అంటే ఛత్రపతిలాంటి కథే అన్నమాట.

ఇందులో ప్రభాస్‌కు రివేంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ముంబై మాఫియాను కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కెజియఫ్‌లో కూడా ముంబై మాఫియా ఉంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్‌లో బాలీవుడ్ నటులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఉగ్రం రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios