పవన్ కు అనుకుంటే కాదు ఎన్టీఆర్ కే అని తేల్చేరే, ఇదేం ట్విస్ట్
వాస్తవానికి ఈ దేవర అనే పదం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ సందర్భాల్లో కామెంట్లు కూడా చేశారు. అంతేకాదు తాను చేయబోతున్న సినిమాకి అదే టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నానని గతంలో కామెంట్లు చేశారు.
తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ ఒకటి. ఇది తమిళ హిట్ చిత్రం ‘వినోదాయ శీతం’చిత్రానికి రీమేక్. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఓ పాట మాత్రమే మిగిలుంది. ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో రెండు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదట వినిపించింది ‘దేవర’. తాజాగా ‘దేవుడే దిగి వచ్చినా’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు ఏం టైటిల్ పెడతారనేది ఆసక్తికరమైన విషయం గా మారింది. అయితే ఇప్పుడు ‘దేవర’ టైటిల్ ..పవన్ సినిమా కు కాదు..ఎన్టీఆర్ సినిమాకి అని వినపడుతోంది. వివరాల్లోకి వెళితే..
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివతో (Koratala Siva) సినిమా చెస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి ఏమి టైటిల్ పెట్టాలా అని కొరటాల శివ, అతని టీమ్ ఆలోచిస్తున్నారు. అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారంను బట్టి ఈ సినిమాకి 'దేవర' (Devara) అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారని తెలిసింది. కొరటాల శివ ఎప్పుడూ తన సినిమాలకి కొంచెం స్ట్రాంగ్ గా టైటిల్స్ వుండే విధంగా చూసుకుంటాడు. అందుకనే 'దేవర' అనే టైటిల్ ఫైనల్ చేసారని అంటున్నారు. అయితే ఈ టైటిల్ అధికారికంగా ధ్రువీకరించలేదు, మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఎన్టీఆర్ దగ్గర ఈ టైటిల్ తో పాటు మరో రెండు టైటిల్స్ పెట్టారని, ఆయన ఫైనల్ చేస్తారని తెలిసింది. కానీ 'దేవర' టైటిల్ కే ఓటేసే అవకాసం ఉందంటున్నారు. వాస్తవానికి ఈ దేవర అనే పదం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ సందర్భాల్లో కామెంట్లు కూడా చేశారు. అంతేకాదు తాను చేయబోతున్న సినిమాకి అదే టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నానని గతంలో కామెంట్లు చేశారు.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేసారు. సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కించాడు కొరటాల శివ. ఈ ఇద్దరి మధ్య కుస్తీ పోటీలని, అంతక ముందు జాతర సెటప్ లోని కొన్ని సీన్స్ ని షూట్ చేశారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ భైరవుడు అనే పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ‘దేవర’గా కనిపించనున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఫర్గాటెన్ లాండ్స్ లో, క్రూర మృగాలకి కూడా భయపడని మనుషులు ఉంటారు. జాలి అనేదే లేని ఆ మృగాల్లాంటి మనుషులని భయపెట్టేది ఒకరే, అతనే నా అన్న ఎన్టీఆర్ అంటూ కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’ అనౌన్స్మెంట్ రోజునే అంచనాలు పెంచేసాడు. ఈ సినిమాకి నిర్మాత ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , కొసరాజు హరికృష్ణ (Kosaraju Harikrishna) లు.